ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajinikanth has been offered a massive remuneration of 225Crs for Thalaiva 174

సూపర్ స్టార్ కి దిమ్మతిరిగే రెమ్యునరేషన్

Rajinikanth has been offered a massive remuneration of 225Crs for Thalaiva 174

స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అదే కాకుండా కమల్ హాసన్ నిర్మాణంలో కమల్-రజినికాంత్ కలిసి కనిపించే చిత్రానికి ముందుగా సుందర్ సి దర్శకత్వంలో అన్నారు. కానీ ఇప్పుడు ఆ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా ఫిక్స్ అయ్యారు.

జైలర్ 2 రిలీజ్ అవ్వగానే నెల్సన్ దిలీప్ కుమార్ తలైవా 174 ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి కమల్-రజిని కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఆ ప్రోజెక్టు పై ఎన్ని అంచనాలు ఉంటాయి, ఆ అంచనాలు అందుకోవాలంటే నెల్సన్ ఎంతగా కష్టపడాలి. అసలు రజినీని, కమల్ ని కలిపి ఎలా చూపిస్తాడు అనే విషయంలో అందరిలో ఉంది.

ఇప్పుడు ఆ క్యూరియాసిటీ ఏమో కానీ.. ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజినీకాంత్ తీసుకుంటున్న పారితోషికం మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గాను సూపర్‌స్టార్‌ 225 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్లుగా కోలీవుడ్ సర్కిల్స్‌లో వినబడుతున్న న్యూస్ చూసి వామ్మో ఇది కనివిని ఎరుగని పారితోషికం అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

అయితే సూపర్ స్టార్ రజినికాంత్ పారితోషికం విషయంలో ఇది రూమరా, లేదంటే నిజామా అనే విషయం కన్నా ఆ పారితోషికం మాత్రం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. 

Superstar Rajinikanth

rajinikanth