రామ్ చరణ్ ట్విన్స్ పేర్లు ఏమిటంటే...
Ram Charan-Upasana name twins Shivram and Anveera Deviమెగా ఫ్యామిలీ వారసులు గత వారమే ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చారు. హీరో రామ్ చరణ్-ఉపాసన జంట కు రెండేళ్ల క్రితమే క్లింకార పాప జన్మించగా.. ఈ ఏడాది జనవరి 31 న ఉపాసన ట్విన్స్ కి జన్మనిచ్చింది. ఒక బాబు, ఒక పాప కు ఉపాసన జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలిలో సంతోషం వెల్లువెత్తింది. రామ్ చరణ్ కి కొడుకు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ సంతోషంతో ఉప్పొంగిపోయారు.
ఫిబ్రవరి మొదటివారంలో రామ్ చరణ్-ఉపాసన జంట తమ కవల పిల్లలతో మెగాస్టార్ ఇంట్లో అడుగుపెట్టారు. తాజాగా రామ్ చరణ్-ఉపాసన తమ కావల పిల్లల నామకరణం (బారసాల) అంగరంగ వైభవంగా పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. మొదటి కుమార్తె కి క్లింకార అని పేరు పెట్టిన రామ్ చరణ్ జంట.. ఇప్పుడు కవల పిల్లలకు పేర్లు పెట్టారు.
కుమారుడి పేరు శివరామ్, కుమార్తె పేరు అన్వీరా దేవి అని నామకరణం చేసినట్లుగా తెలుస్తుంది. మరి మెగాస్టార్ చిరు అసలు పేరు శివశంకర వరప్రసాద్, మనవడి కి ఆయన పేరు లోని శివ, రామ్ చరణ్ పేరులోని మొదటి అక్షరాలను రామ్ గా తీసుకుని శివరామ్ గా పెట్టారు. సో మెగా వారసుడి పేరు శివరామ్ అన్నమాట.
Ram Charan on naming twins Shivram and Anveera Devi






































