ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chandra Hass Gets Emotional Crying At Barabar Premistha Movie Screening

చేసిందంతా చేసి కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా

Chandra Hass Gets Emotional Crying At Barabar Premistha Movie Screening

బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ తన సినిమా ప్రమోషన్స్ లో చేసిన వెధవపనికి ఆడియన్స్ గట్టిగానే శిక్ష వేశారు. చంద్రహాస్ నటించిన బరాబర్ ప్రేమిస్తా చిత్రాన్ని ప్రమోట్ చేసే క్రమంలో బూతు పాట పాడి అందరిని తనవైపు తిప్పుకోవాలనుకున్నాడు, కానీ అది కాస్తా మిస్ ఫైర్ అయ్యింది. బరాబర్ ప్రేమిస్తా కి హెల్ప్ అవుతుంది అనుకున్న ఆ పాట నెగెటివ్ అయ్యి సోషల్ మీడియాకి టార్గెట్ అయ్యాడు చంద్రహాస్.

ఇప్పుడు చంద్రహాస్ నటించిన చిత్రానికి ప్రేక్షకులు కరువయ్యారు. ఈరోజు AMB సినిమాస్‌లో బరాబర్ ప్రేమిస్తా సినిమా స్క్రీనింగ్ కి యూనిట్ వెళ్ళింది. అక్కడ జనాలు లేరు, అది చూసి చంద్రహాస్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొంతమందికి నచ్చుతుందని నేను చేసిన తప్పుకి సినిమాపై ఎఫెక్ట్ అవుతుందేమో అని భయంగా ఉంది.. అంటూ చంద్రహస్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

చంద్రహాస్ కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో చిత్ర బృందం అతన్ని ఓదార్చిన వీడియో వైరల్ అవుతోంది. మరి చెంసిందంతా చేసి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తారా చంద్రహాస్, తప్పు చేసేముందు ఉండాలి, చేసాక కూడా సారీ చెప్పను అంటూ ఓవర్ చేసావ్ ఇప్పుడు అనుభవించు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

 

Chandra Hass Gets Emotional Crying At Barabar Premistha Movie Screening In AMB Cinemas

chandra hass