రామాయణ లోకి మరో క్రేజీ స్టార్
Vijay Sethupathi set to turn Vibhishana in Ramayanaబాలీవుడ్ లో నితీష్ తివారి రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ రామాయణ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీత గా సాయి పల్లవి, రావణ్ గా యష్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మిగతా పాత్రల కోసం కూడా నితీష్ తివారి పేరున్న క్రేజీ నటులనే ఎంచుకుంటున్నారు. గత ఏడాది వదిలిన రామాయణ పార్ట్ 1 గ్లింప్స్ ఎంతగా సెన్సేషన్ సృష్టించాయో చూసారు.
రావణ్ పాత్రధారి గా యాష్ కనిపిస్తుండగా.. ఆయనకు తమ్ముడు విభీషణుడి పాత్రలోకి తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కనిపించనున్నారని తెలుస్తోంది. అధర్మం వైపు నిలబడే అన్న రావణుడికి, ధర్మం కోసం ప్రాణాలైనా ఇచ్చే విభీషణుడి పాత్రలో విజయ్ సేతుపతి నటించబోతున్నారని తెలుస్తుంది.
రామాయణ పార్ట్ 1 ని ఈఏడాది దివాళి కి విడుదల చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. పార్ట్ 2ని వచ్చే ఏడాది విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు.
Ramayana Makers Cast Vijay Sethupathi as Vibhishana






































