ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Megastar Chiranjeevi and Mega Family Visiting Apollo Hospitals

మెగా ఫ్యామిలీ సంతోషం మెగాస్టార్ మాటల్లో

Megastar Chiranjeevi and Mega Family Visiting Apollo Hospitals

మెగా ఫ్యామిలోకి ఒకేసారి వారసుడు తో పాటుగా వారసురాలి రాక మెగా ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసింది. రామ్ చరణ్-ఉపాసన ల జంటకు జనవరి 31 న ట్విన్స్(బాబు-పాప) జన్మించినట్టుగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఆ సంతోషంలోనే మెగాస్టార్ చిరు అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో మీడియా తో మాట్లాడారు.

చాలా చాలా సంతోషంగా వుంది, కొణిదెల ఫ్యామిలీ , కామినేని ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉన్నాం, రామ్ చరణ్ ఉపాసన రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసన, బిడ్డలు చాలా హెల్తీ గా వున్నారు, ఎప్పటి నుంచో ఎక్కడెక్కడి నుంచో మా ఇంట శుభం కలగాలి అని కోరుకున్నారు. 

ఆ భగవంతుడు దయ వల్ల హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ ఒక మగ బిడ్డ జన్మించారు , ఈ వార్తను మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. అభిమానులు పండుగ లాగా జరుపుకుంటున్నారు, వాళ్ళ ఆనందానికి అవధులు లేవు అందరికీ థాంక్స్ అంటూ చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేసారు. 

Ram Charan and Upasana welcome twins

chiranjeevi