Advertisementt

ద‌ర్శ‌క‌ధీరుడికి మాత్ర‌మే సాధ్యం

Sun 07th Dec 2025 05:54 PM
deva katta  ద‌ర్శ‌క‌ధీరుడికి మాత్ర‌మే సాధ్యం
Deva Katta went on to express deep admiration for director SS Rajamouli ద‌ర్శ‌క‌ధీరుడికి మాత్ర‌మే సాధ్యం
Advertisement
Ads by CJ

ద‌ర్శ‌కధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఒక సినిమాని తెర‌కెక్కిస్తున్నారు అంటే దానిపై దేశ‌వ్యాప్తంగా అత్యంత భారీ అంచ‌నాలుంటాయి. బాహుబ‌లి-బాహుబ‌లి 2, ఆర్.ఆర్.ఆర్ చిత్రాల‌తో అత‌డు ప్ర‌పంచం దృష్టిని త‌న‌వైపున‌కు తిప్పుకున్నాడు. అతడి ప్ర‌తిభ గురించి ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా ప్ర‌శంసించిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. నిజానికి రాజ‌మౌళి ప్ర‌తిభ‌, విజ‌న్ ఎంతో గొప్ప‌వి. ఆయ‌న‌లా ఇమాజిన్ చేయ‌డం ఇత‌రుల వ‌ల్ల కాద‌ని దేవ‌క‌ట్టా అన్నాడు. ఆయ‌న తెర‌కెక్కించిన వాటిని త‌న‌ను తీయ‌మంటే అది చాలా ఛీప్ గా మారిపోతుంద‌ని అన్నాడు. తాను సినిమాని ఆ స్థాయిలో తీయ‌లేన‌ని కూడా వ్యాఖ్యానించాడు.

ఇప్పుడు `వార‌ణాసి` చిత్రాన్ని రాజ‌మౌళి గ‌త చిత్రాల కంటే ఎంతో భారీ కాన్వాస్ తో రూపొందిస్తున్నార‌ని దేవాక‌ట్టా తెలిపారు. ఈగ‌, బాహుబ‌లి, బాహుబ‌లి 2, ఆర్.ఆర్.ఆర్ .. వీట‌న్నిటినీ క‌లిపితే వ‌చ్చేంత భారీ ఔట్ పుట్ ని ఒక్క‌ వార‌ణాసితో ఇవ్వ‌బోతున్నాడ‌ని చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. వార‌ణాసి చిత్రం కోసం కెఎల్ నారాయ‌ణ‌ అత్యంత భారీ బడ్జెట్ ని కూడా పెడుతున్నార‌ని దేవ‌క‌ట్టా మాట‌లు చెబుతున్నాయి. రాజ‌మౌళి త‌న సినిమాల‌ను ఎంత భారీగా తెర‌కెక్కించినా రియాలిటీ చెడిపోద‌ని, ఎంతో స‌హ‌జ సిద్ధంగా ఎమోష‌న్స్ తో అంద‌రికీ క‌నెక్ట‌వుతుంద‌ని అన్నారు. 

రాజ‌మౌళి సినిమాలో ఎమోష‌న్స్ ఎక్క‌డా మిస్ కావ‌ని కూడా దేవ‌క‌ట్టా వివ‌రించారు. వార‌ణాసి చిత్రాన్ని దేవ‌క‌ట్టా ఏకంగా ఆకాశంలోకి ఎత్తేసారు. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్, ర‌చ‌యిత దేవ‌క‌ట్టా వెన్నెల‌, ప్రస్థానం లాంటి క్లాసిక్ హిట్ సినిమాల‌ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. బుల్లితెర కోసం బాహుబ‌లి ప్రీక్వెల్ ని తెరకెక్కించాల‌ని భావించినా కానీ, దేవ‌క‌ట్టా కొన్ని సాంకేతిక కార‌ణాల‌తో మిడిల్ డ్రాప్ అయ్యారు.

Deva Katta went on to express deep admiration for director SS Rajamouli :

Varanasi Is Rajamouli Biggest And Best Till Date: Deva Katta

Tags:   DEVA KATTA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ