ఆంధ్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ నారా లోకేష్ పార్టీ కార్యకర్తలను మీట్ అవుతూ.. ఏపీ కి భారీ పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ అమెరికా పర్యటన సాగనుంది. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న అవకాశాలను మంత్రి నారా లోకేష్ వివరించనున్నారు. గతంలో మంత్రి హోదాలో నారా లోకేష్ అమెరికాలో పర్యటించడం ద్వారా గూగుల్ ను రాష్ట్రానికి రప్పించగలిగారు. ఈసారి కూడా అమెరికా వెళ్లిన నారా లోకేష్ భారీ పెట్టుబడులు సాధించుకువస్తారని టీడీపీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నారా లోకేష్ డల్లాస్ లో పర్యటిస్తున్నారు. డల్లాస్ నగరంలో వేలాది మంది తెలుగు ప్రవాసంధ్రులను ఉద్దేశిస్తూ మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు.. కష్ట సమయంలో పార్టీకి అండగా నిలిచిన ఎన్ఆర్ఐలను Most Reliable Indians – MRIsగా అభివర్ణించారు. ఆంధ్ర అయినా, అమెరికా అయినా కార్యకర్తే అధినేత, ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్‌లో 175 సీట్లలో 164 సీట్ల చారిత్రాత్మక విజయం సాధించడంలో ప్రవాసుల పాత్ర అమూల్యమని నారా లోకేష్ కొనియాడారు. .
ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ముందుకు వెళ్తోందని, స్పీడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఏపీ నిలుస్తోంది లోకేష్ అని అన్నారు. 8 కీలక పరిశ్రమల, సాంకేతిక రంగాల్లో వికేంద్రీకృత అభివృద్ధి ఊపందుకున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల సృష్టినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పటికే ₹20 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, వాటితో 16 లక్షల ఉద్యోగావకాశాలు లభించే స్థితికి వచ్చామని వెల్లడించారు.
విదేశాల్లో ఉన్న తెలుగు విద్యార్థుల కోసం వచ్చే ఏడాది నుంచి కలలకు రెక్కలు పథకాన్ని అమలు చేస్తామని, విదేశాల్లోని ప్రతి తెలుగు కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా AP NRT పూర్తిగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. యువత ఉద్యోగాల కోసం తిరిగేవారిగా కాకుండా, ఉద్యోగాలు కల్పించే నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.




ఈసారి బిగ్ బాస్ కప్ : ఎవ్వరైనా సెన్సేషనే 
Loading..