అవును ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కప్ ఎవరు గెలిచినా సెన్సేషనే అవుతుంది. బిగ్ బాస్ సీజన్9 ట్రోఫీ ఇప్పుడు ముగ్గురు చుట్టూనే తిరుగుతుంది. అది ఒకరు కామనర్ కళ్యాణ్ పడాల, మరొకరు కన్నడ నటి తనూజ, ఇంకొకరు కమెడియన్ ఇమ్మాన్యుయేల్. ఈ ముగ్గురిలో ఎవరు ట్రోఫీ అందుకున్నా అది సెన్సేషనే.
కారణం ఒక కామనర్ బిగ్ బాస్ ట్రోఫీ అందుకోవడం నిజంగా సర్ ప్రైజ్. ఎలాంటి అంచనాలు లేకుండా తన వ్యక్తిత్వంతో, టాస్క్ పెరఫార్మెన్సు తో టాప్ 5 కి దూసుకొచ్చాడు కళ్యాణ్. బయట కూడా కళ్యాణ్ పడాల కే ఎక్కువగా ట్రోఫీ దక్కే ఛాన్స్ ఉంది అంటూ సపోర్ట్ కనబడిండి. మరొకరు కన్నడ సీరియల్ నటి తనూజ. తనూజ అందం, అణుకువ, టాస్క్ పెరఫార్మెన్స్ తో ఆడియన్స్ మనసు గెలుచుకుంది.
కాకపోతే తనూజ కి బిగ్ బాస్ ముద్దుబిడ్డ, నాగార్జున ఫెవరెట్ కంటెస్టెంట్ అనే ట్యాగ్స్ ఆమెకి కొద్దిగా నెగిటివిటీ తెచ్చిపెట్టాయి కానీ.. లేదంటే తనూజ విన్నర్ మెటీరియల్. ఇప్పుడు ఆమె కప్ కొడితే లేడీ విన్నర్ గా సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. గతంలో ఓటీటీ బిగ్ బాస్ టైటిల్ ని బిందుమాధవి అందుకున్నా సీజన్ 8 వరకు ఎవ్వరూ లేడీ విన్నర్స్ అవ్వలేదు.
ఇక ఇమ్మాన్యుయేల్ కప్ కొట్టినా అది సెన్సేషనే. కారణం ఒక కమెడియన్ కప్ కొట్టడం సర్ ప్రైజ్ కాక ఇంకేమవుతుంది. కేవలం కామెడీతో మనసులు గెలుచుకునే కమెడియన్స్ లో ఇమ్ము స్పెషల్ అనే చెప్పాలి. అటు కామెడీ ఇటు టాస్క్ పెరఫార్మెన్సు అన్ని సూపర్. సో ఇమ్మాన్యుయేల్ కప్ అందుకున్నా అది ఈసారి క్రేజీ అవుతుంది. చూద్దాం ఈముగ్గురిలో ఎవరు ట్రోఫీ అందుకుంటారో అనేది.




భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి 
Loading..