సూపర్ స్టార్ మహేష్ తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మూవీ టైటిల్ విషయంలో ఏదో గందరగోళం నడిచినా.. #GlobeTrotter ఈవెంట్ సక్సెస్ అవడంతో టీమ్ రిలాక్స్ అవుతున్నారు. ఒకే ఈవెంట్ లో వారణాసికి సంబందించిన బోలెడన్ని అప్ డేట్స్ ఇచ్చెయ్యడంతో మహేష్ అభిమానులు వాటిని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు.
అయినప్పటికీ మహేష్ వారణాసి ఏదో విధంగా వార్తల్లోనే నిలుస్తుంది. తాజాగా రాజమౌళి-మహేష్ కాంబో వారణాసికి ఓటీటీ కి సంబందించిన డీల్ అందరికి పిచ్చ షాకిస్తుంది. వారణాసి కోసం ఏకంగా 1000 కోట్ల ఓటీటీ డీల్ సెట్ అవుతుంది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. అది చూసి అందరూ జోక్ అంటున్నారు.
కానీ ఆ ఫిగర్ విని మహేష్ ఫ్యాన్స్ కి బ్లాంక్ అయ్యింది. గ్లోబల్ వైడ్ గా వారణాసి కి ఓటీటీ డీల్ సెట్ అయ్యింది అంటున్నారు. ఇప్పటివరకు 100, 150 కోట్ల ఓటీటీ డీల్ విన్నాం కానీ.. వారణాసి కి ఏకంగా 1000 కోట్ల ఓటీటీ డీల్ ఏమిట్రా బాబు అంటూ కామెడీగా నవ్వుకుంటున్నారు. మరికొందరు అదే నిజమైతే ఇంతకన్నా పెద్ద సెన్సేషన్ ఏముంటుంది అంటున్నారు.




తారక్ తో నైటౌట్ ఎలా ఉందబ్బా
Loading..