అఖండ 2 డిసెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ అయ్యింది. ఈరోస్ సంస్థతో 14 రీల్స్ సంస్థకున్న ఆర్ధిక లావాదేవీలు కోర్టుకెళ్లి అక్కడ నుంచి సినిమా విడుదల కాకుండా ఈరోస్ సంస్థ స్టే తెచ్చింది. దానితో సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆ ఆర్థికలావాదేవీలు పూర్తయినా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది అర్ధం కాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.
కొంతమంది డిసెంబర్ 19 అంటుంటే మరికొందరు డిసెంబర్ 25 క్రిస్టమస్ అంటున్నారు. ఇంకొందరు బాలయ్య జనవరి లో సంక్రాంతికి ముహూర్తం పెడుతున్నారనే మాట అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. అఖండ 2ని దసరా దగ్గర నుంచి డిసెంబర్ 5 కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడేమో 14 రీల్స్ వల్ల వాయిదాపడింది అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు బాలకృష్ణ డిసెంబర్ 5 కి ముహూర్తం పెట్టారు, అది ఫెయిల్ అయ్యింది. మరో ముహూర్తం ఆయన ఎప్పుడు పెడతారో, అసలే బాలయ్య కు జాతకాల పిచ్చి. దానిని బట్టి అఖండ 2 తాండవం ముహూర్తం పెట్టాలి, అదెప్పుడు ఉంటుందో అనే అయోమయంలో అభిమానులు ఉన్నారు.




అఖండ కోసం ఆగితే ఇలా అయ్యిందేమిటి.. 
Loading..