బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటి ఫైనలిస్ట్ అయ్యేందుకు ఈ వారమంతా టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ల్లో ఒక్కొక్కరు గెలుస్తూ ఫైనల్ గా టాస్క్ లో కళ్యాణ్, రీతూ, ఇమ్మాన్యుయెల్ లు పోటీపడ్డారు. కామనర్ గా గ్రాఫ్ పెంచుకుంటూ టైటిల్ పోరుకు దగ్గరైన కళ్యాణ్ పడాల అటు నామినేషన్స్ లోకి వస్తే ఓటింగ్ లో టాప్ లో ఉంటున్నాడు, ఇటు టాస్క్ ల్లోనూ ఎనర్జీ తెచ్చుకుని పోటీపడుతున్నారు.
సీజన్ 9 లాస్ట్ కెప్టెన్ అయ్యేందుకు డిమోన్ పవన్ తో పోరాడి గెలిచాడు. ఇప్పుడు టికెట్ టు ఫినాలే టాస్క్ ల చివరి పోరులో తనూజ సపోర్ట్ తో గెలిచి మొదటి ఫైనలిస్ట్ గా కళ్యాణ్ పడాల ప్రభంజనం సృష్టించాడు. ఇమ్మాన్యుయేల్ లాంటి గట్టి పోటీదారుణ్ని ఓడించి మరీ కళ్యాణ్ పడాల అన్ని టాస్క్ లు గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు.
సో ఇప్పటికే కళ్యాణ్ పడాల విన్నర్ ట్రోఫీకి దగ్గరయ్యాడు. ఇప్పుడు తన స్టామినా తో తన స్ట్రాటజీ లతో టాస్క్ లు గెలిచి మొదటి ఫైనలిస్ట్ గా నేరుగా టాప్ 5 లోకి అడుగుపెట్టాడు. మరి కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 కప్ కొట్టినా కొట్టొచ్చనే మాట సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. చూద్దాం కళ్యాణ్ అదృష్టం ఎలా ఉందొ అనేది.




వేణుస్వామి పై నందమూరి అభిమానులు ఫైర్ 
Loading..