Advertisementt

ఫస్ట్ యానివర్సరీ - స్పెషల్ వీడియోతో శోభిత

Thu 04th Dec 2025 03:22 PM
sobhita  ఫస్ట్ యానివర్సరీ - స్పెషల్ వీడియోతో శోభిత
Sobhita Shares heartfelt video ఫస్ట్ యానివర్సరీ - స్పెషల్ వీడియోతో శోభిత
Advertisement
Ads by CJ

నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ను ప్రేమించి 2024 డిసెంబర్ 4 న పెద్దల అంగీకారంతో అన్నపూర్ణ స్టూడియోస్ లో కొద్దిమంది స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. శోభిత అఫీషియల్ గా గత ఏడాది డిసెంబర్ 4 న అక్కినేని ఇంట పెద్ద కోడలిగా అడుగుపెట్టింది. 

చైతు-శోభితల వివాహమై నేటికి ఏడాది పూర్తి కావడంతో శోభిత దూళిపాళ్ల తన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి అద్భుతమైన వీడియో షేర్ చేసింది. అది చైతూతో తను మూడు ముళ్ళు వేయించుకున్న పెళ్లి వీడియో. నాగ చైతన్య తో మూడు ముళ్ళు వేయించుకుని ఏడడుగులు నడిచి సప్తపదుల సాక్షిగా బిందెలో ఉంగరాల ఆట ఆడిన ఆ పెళ్లి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. 

శోభిత-నాగ చైతనయ్ దంపతులకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు చైతు మాజీ భార్య సమంత కూడా డిసెంబర్ 1 న రాజ్ నిడిమోరు ని వివాహం చేసుకుని ఓ ఇంటిదైంది. సో అటు సమంత, ఓటు చైతు ఇద్దరూ తమ తమ  వైవాహిక జీవితాల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. 

Sobhita Shares heartfelt video:

 Sobhita Dhulipala Shares A Wholesome Wedding Video On First Anniversary

Tags:   SOBHITA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ