Advertisementt

మెగా డ్యామేజ్ ను సరిదిద్దుకున్న దిల్ రాజు

Tue 01st Jul 2025 06:13 PM
sirish  మెగా డ్యామేజ్ ను సరిదిద్దుకున్న దిల్ రాజు
Dil Raju repairs mega damage మెగా డ్యామేజ్ ను సరిదిద్దుకున్న దిల్ రాజు
Advertisement
Ads by CJ

తమ్ముడు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ శిరీష్ గేమ్ చేంజర్ ప్లాప్ పై తమ్ముడు ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. గేమ్ చెంజర్ రిజల్ట్ తర్వాత హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ తమను పట్టించుకోలేదు, కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు, గేమ్ చేంజర్ తో మా పనైపోయింది అనుకున్నాం, కానీ సంక్రాంతికి వస్తున్నాం తో ఒడ్డున పడ్డాం అంటూ చేసిన కామెంట్స్ పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రామ్ చరణ్ విషయంలో శిరీష్ అలా ఎలా కామెంట్స్ చేస్తారు అంటూ ఫైర్ అవుతున్నారు. గేమ్ చేంజర్ వలన రామ్ చరణ్ కు ఎంత డ్యామేజ్ జరిగిందో మీకు తెలియదా అంటూ దిల్ రాజు, శిరీష్ లపై వారు ఆగ్రహంగా ఉన్నారు. 

అయితే మెగా అభిమానుల ఆగ్రహం తమ్ముడు పై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ప్రొడ్యూసర్ దిల్ రాజు వెంటనే రంగంలోకి దిగారు. మా తమ్ముడు శిరీష్ ఇప్పటివరకు ఇంటర్వూస్ ఇవ్వలేదు, ఫస్ట్ టైమ్ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు, అందులో అతను చరణ్ విషయం ఎలా మాట్లాడాలో తెలియక ఎమోషనల్ అయ్యాడు. 

గేమ్ చేంజర్ తో డబ్బు పోగొట్టుకున్నాము, సంక్రాంతికి వస్తున్నాం తో సేవ్ అయ్యామని చెప్పే ప్రొసెస్ లో అలా మాట్లాడాడు, అంతేకాని చరణ్ ని తప్పుబట్టాలని కాదు, అయినా హీరోకి మాకు ఫోన్ చెయ్యాల్సిన అవసరం ఏముంటుంది, మాకు ఇష్టమై డబ్బు పెట్టి సినిమా చేశామని ఆ ఇంటర్వ్యూ చివరిలో చెప్పాడు అంటూ దిల్ రాజు శిరీష్ చరణ్ పై చేసిన కామెంట్స్ పై వివరణ ఇచ్చారు, మరి ఈ వివరణతో మెగా అభిమానులు శాంతిస్తారేమో చూడాలి. 

Dil Raju repairs mega damage:

Mega Fans are Angry with Producer Sirish Statements

Tags:   SIRISH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ