Advertisement

ఓటిటీలోకి వచ్చేసిన విరూపాక్ష

Sun 21st May 2023 12:05 PM
virupaksha  ఓటిటీలోకి వచ్చేసిన విరూపాక్ష
Virupaksha now in OTT ఓటిటీలోకి వచ్చేసిన విరూపాక్ష
Advertisement

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విరూపాక్ష ఇప్పుడు ఓటిటీ ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చేసింది. ఏప్రిల్ 21 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ కలెక్షన్స్ తో ఏకంగా 100 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయ్యింది. కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు ఓ సినిమాని ఏ రేంజ్ హిట్ చేస్తారో అనేది చిన్న సినిమా విరూపాక్ష నిరూపించింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే భారీ హిట్ గా విరూపాక్ష నిలిచింది. 

అయితే హిట్ అయ్యింది కదా విరూపాక్ష అప్పుడే ఓటిటిలోకి రాదు అనుకుంటే.. థియేటర్స్ లో ఇంత పెద్ద విజయం సాధించిన ఈ చిత్రాన్ని కేవలం నాలుగు వారాల్లోనే అంటే నెలతిరిగే లోపే ఓటిటిలో విడుదల చేసారు. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుండి విరూపాక్ష నేడు ఓటిటి ఆడియన్స్ అందుబాటులోకి వచ్చేసింది. గత అర్ధరాత్రి నుండి నెట్ ఫ్లిక్స్ లో విరూపాక్ష స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. 

దానితో ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా విరూపాక్షని వీక్షించేందుకు రెడీ అయ్యారు. థియేటర్స్ లో ఈ బ్లాక్ బస్టర్ ని మిస్ అయిన వారు ఈరోజు ను నుండి ఈ చిత్రాన్ని ఓటిటిలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

Virupaksha now in OTT:

Blockbuster Virupaksha is now streaming on this OT

Tags:   VIRUPAKSHA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement