Advertisement

ఇతర భాషల్లో విరూపాక్ష చప్పుడేది

Mon 08th May 2023 01:34 PM
virupaksha  ఇతర భాషల్లో విరూపాక్ష చప్పుడేది
In other languages, Virupaksha is a slap ఇతర భాషల్లో విరూపాక్ష చప్పుడేది
Advertisement

ఏప్రిల్ 21 న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమేమిటి.. మూడు వారాలు తిరక్కుండానే 91 కోట్ల కలెక్షన్స్ తో మేకర్స్ కి లాభాలే లాభాలు అన్నట్టుగా విరూపాక్షని ఆడియన్స్ ఆదరించారు. విరూపాక్ష రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అవడంతో మే 5 న తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసారు. ప్రమోషన్స్ కోసం నిర్మాత, హీరో సాయి తేజ్, హీరోయిన్ సంయుక్త, దర్శకుడు కార్తిక్ దండులు చెన్నై, బెంగుళూరు, ముంబై అంటూ తెగ తిరిగేశారు.

మే 5 న మిగతా లాంగ్వేజెస్ లో విడుదలైన విరూపాక్ష కి పాజిటీవ్ టాక్ వచ్చింది అన్నారు కానీ.. అది ఎంత సక్సెస్ అయ్యిందో మొదటి వీకెండ్ లో హిందీ, తమిళ, మలయాళ, కన్నడ కలెక్షన్స్ పై మేకర్స్ నుండి ఎలాంటి చప్పుడు లేదు. బాగా ఆడితే కలెక్షన్స్ పోస్టర్స్ తో హడావిడి మొదలైయ్యేది. కానీ తెలుగులో విరూపాక్ష సక్సెస్ అయినట్టుగా ఇతర లాంగ్వేజెస్ లో అంత సక్సెస్ అవ్వకపోవడంతోనే మేకర్స్ గప్ చుప్ గా ఉన్నారంటున్నారు.

అసలు ప్రమోషన్స్ ఖర్చులైనా వచ్చాయో, లేదో అనే డౌట్ కూడా పడుతున్నారు. ఇక్కడ కలెక్షన్స్ పరంగా మెగా హీరో సాయి తేజ్ కెరీర్ లో బెస్ట్ ఫిలిం గా నిలిచిన విరూపాక్ష మిగతా లాంగ్వేజెస్ లో మాత్రం కామైపోయింది అనే చెప్పాలి. 

In other languages, Virupaksha is a slap:

Can The Successful Thriller Virupaksha Click In Other Languages?

Tags:   VIRUPAKSHA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement