Advertisement

నాని చెప్పేది అక్షరాలా నిజం

Mon 03rd Apr 2023 08:18 PM
nani,dasara  నాని చెప్పేది అక్షరాలా నిజం
What Nani says is literally true నాని చెప్పేది అక్షరాలా నిజం
Advertisement

దసరా సక్సెస్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నాని చాలా ఫన్నీగా, ఆసక్తికరంగా ఆన్సర్ ఇచ్చాడు. ముఖ్యంగా దసరా నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదా? అందుకే అక్కడ కలెక్షన్స్ పూర్ గా ఉన్నాయని మీడియా వాళ్ళు అడిగితే.. నేనేమన్నా అమితాబ్ బచ్చన్ నా.. ఓపెనింగ్ డే నే ఇరగాడెయ్యడానికి.. మెల్లగా టాక్ ని బట్టి కలెక్షన్స్ పెరుగుతాయి. నేను నార్త్ ఆడియన్స్ కి ఏమి తెలుసు. అందుకే అలా.. అయినా ఇప్పటికే సినిమా చూసిన వారు చాలా అద్భుతంగా వుంది అంటున్నారు.  గొప్ప రివ్యూలు వచ్చాయి. సినిమా చూసిన వారంతా ఈ ఏడాది మా ఫేవరేట్ ఫిల్మ్ దసరా అని చెబుతున్నారు. మేము ఊహించినదాని కంటే అక్కడ ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. 

మేము ఊహించిన ఓపెనింగ్ వచ్చేసింది. దసరా కి వచ్చింది కొన్ని స్ట్రయిట్ హిందీ సినిమాలకి కూడా రాలేదు. రోజురోజుకి కలెక్షన్ పెరుగుతోంది.. అన్నాడు నాని. నిజమే నాని చెప్పింది అక్షర సత్యం. నాని ఇంతకుముందు హిందీలో కనిపించలేదు, ప్రమోషన్స్ పరంగాను ఏదో ఒక ప్రెస్ మీట్ తో లాగించేసాడు. అందుకే హిందీలో దసరా కలెక్షన్స్ అలా ఉన్నాయి.

రామ్ చరణ్ కు రంగస్థలం, అల్లు అర్జున్ కి పుష్ప.. మీకు దసరా అలా అని సోషల్ మీడియాలో  మాట్లాడుకుంటారు.. ఈ సినిమా మీలో నటుడికి తృప్తిని ఇచ్చిందా అని అడగగా..

నటుడిగా నేను ఆనందపడతాను. కానీ తృప్తి పడను. ఎప్పుడు తృప్తి పొందుతామో ఇంకా ప్రయత్నం చేయడంలో అలసత్వం వచ్చేస్తుంది. ఈ సినిమాకే కాదు.. ఏ సినిమాకి తృప్తి పడను. ఆనందం మాత్రం వుంటుంది. దసరా తో టీం అందరికీ  మంచి పేరు వచ్చింది. కథ విన్నప్పుడే. ప్రేమ స్నేహం పగ యూనివర్శల్ గా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్. మన కల్చర్ ని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఏదైనా దొరికితే అది అందరి దగ్గరకి తీసుకెళ్లడం మన బాధ్యత. ఈ సినిమా చేస్తున్నపుడు బతుకమ్మ తో పాటు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి కథ వచ్చినపుడు ఇది మా కల్చర్ చెప్పడం మన బాధ్యత. దినిని అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కాంతారతో భూత్ కొళా అనేది కర్ణాటకలో వుందని దేశంలో అందరికీ తెలిసింది. ఇలా మన కల్చర్ ని చెప్పే అవకాశం వచ్చినపుడు దానిని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి.. అంటూ నాని చెప్పాడు.

 

What Nani says is literally true:

Nani about Dasara north collections 

Tags:   NANI, DASARA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement