Advertisement

ఆ లిస్ట్ లోకి రాజమౌళి కూడా వచ్చేసారు

Mon 03rd Apr 2023 07:46 PM
ss rajamouli,dasara  ఆ లిస్ట్ లోకి రాజమౌళి కూడా వచ్చేసారు
SS Rajamouli Congratulated Team Dasara For Wonderful Success ఆ లిస్ట్ లోకి రాజమౌళి కూడా వచ్చేసారు
Advertisement

ఇప్పటివరకు ఆడియన్స్ మాత్రమే కాదు.. సినిమా సెలెబ్రిటీస్ అందులోను స్టార్ హీరోలు నాని దసరాని పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. గురువారం నవమి రోజున రిలీజ్ అయ్యి సెన్సేషన్ హిట్ అయిన దసరాని సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందించారు. దసరా టీమ్ ని, నానిని, మ్యూజిక్ డైరెక్టర్ ని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలని ప్రత్యేకంగా అపొగిడారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే మనం ఇలాంటి సినిమాలు ఇంకా చెయ్యాలి అంటూ ప్రశంశించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దసరా పోస్టర్ ని షేర్ చేస్తూ.. ఇప్పుడే దసరా సినిమా చూశాను. సినిమా సూపర్ గా ఉంది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా చేసినందుకు నానికి నా అభినందనలు. నానితో పాటు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, కీర్తి సురేష్, మిగిలిన టీం అంతా బాగా వర్క్ చేశారు. మనం ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి అంటూ ప్రభాస్ దసరా టీం ని ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేసారు.

ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఆస్కార్ విజేత రాజమౌళి వచ్చేసారు. రాజమౌళి నాని దసరాని ప్రశంసించడం అంటే దసరా ఏ రేంజ్ హిట్టో అర్ధమవుతుంది. నాని, హీరోయిన్ కీర్తి సురేశ్ గొప్పగా పెర్ఫార్మ్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ప్రతి సన్నివేశాన్ని హృద్యంగా తెరకెక్కించాడు. దాసరితో పెద్ద హిట్ అందుకున్న టీమ్ కి అభినందనలు.. అంటూ రాజమౌళి దసరా టీం ని సోషల్ మీడియా ద్వారా అభినందించారు..

దానికి శ్రీకాంత్ ఓదెల రియాక్ట్ అవుతూ.. Em pettaalo kuda ardham kavatledhu ❤️❤️❤️ thank you so much sirrrr అంటూ రిప్లై ఇచ్చాడు. మరి దసరా కలెక్షన్స్ మొదటి వీకెండ్ లోనే 80 కోట్ల గ్రాస్ ని దాటేసింది.. దసరా 100 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.

SS Rajamouli Congratulated Team Dasara For Wonderful Success:

SS Rajamouli Praised Team Dasara For Wonderful Success

Tags:   SS RAJAMOULI, DASARA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement