Advertisement

అల్లు అర్జున్ పుష్ప2 డేట్ రాబోతోందా?

Thu 30th Mar 2023 11:25 AM
allu arjun,pushpa 2 update  అల్లు అర్జున్ పుష్ప2 డేట్ రాబోతోందా?
Allu Arjun Pushpa 2 date coming? అల్లు అర్జున్ పుష్ప2 డేట్ రాబోతోందా?
Advertisement

అల్లు అర్జున్ బర్త్ డే కి పుష్ప నుండి ఏదో ఒక అప్ డేట్ అయితే కచ్చితంగా ఉంటుంది. పుష్ప ద రూల్ గ్లిమ్ప్స్ కావొచ్చు, లేదంటే పుష్ప 2 ఫస్ట్ లుక్ కానీ విడుదలవుతుంది.. ఇది అల్లు అర్జున్ ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అప్ డేట్స్. పుష్ప ద రూల్ నుండి అల్లు అర్జున్ యాక్షన్ సీక్వెన్స్ కి సంబందించిన గ్లిమ్ప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయనే టాక్ వినిపిస్తుంది. అయితే అదే రోజు పుష్ప 2 డేట్ లాక్ చేస్తారేమో అంటున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా ఫిలిమ్స్ డేట్స్ ఓ ఏడాది ముందుగానే లాక్ చేస్తేనే బాలీవుడ్ లో పోటీ ఉండదు. లేదంటే అక్కడి సినిమాలు మంచి డేట్స్ ఆక్యుపై చేస్తే మనకి కష్టం.

అందుకే పుష్ప ద రూల్ రిలీజ్ డేట్ అల్లు అర్జున్ బర్త్ డే కి అంటే ఏప్రిల్ 8 అనౌన్స్ చేసే అవకాశం ఉంది.. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు తమ తమ సినిమాల రిలీజ్ డేట్ లాక్ చేసి పెట్టారు. సో ఇక అల్లు అర్జున్ పుష్ప డేట్ కూడా వస్తుంది అంటున్నారు. అయితే వచ్చే ఏడాది సమ్మర్ లో పుష్ప ద రూల్ రిలీజ్ చెయ్యడానికి సుకుమార్ అండ్ మేకర్స్ ఆలోచిస్తూన్నారని తెలుస్తుంది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ కానీ లేదంటే మే ఫస్ట్ వీక్ లో కానీ పుష్ప ద రూల్ విడుదల ఉండబోతుంది.

మరి అదే డేట్ ని లాక్ చేసి ప్రకటిస్తారా.. లేదంటే 2024 సమ్మర్ ని చెబుతారో అనే ఆలోచనలో అల్లు ఫాన్స్ ఉన్నారు. పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి సమ్మర్ హాలిడేస్ ని టార్గెట్ చేస్తే బెటర్ అని ఫాన్స్ ఒపీనియన్. మరి మేకర్స్ ఆలోచన ఎలా ఉందొ చూడాలి.

Allu Arjun Pushpa 2 date coming?:

Allu Arjun Pushpa 2 update

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement