Advertisement

ఈటీవీ లోకి సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీ

Thu 10th Nov 2022 03:17 PM
sudhir sudheer,sridevi drama company,etv  ఈటీవీ లోకి సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీ
Sudhir Sudheer re-entry into ETV was a shock ఈటీవీ లోకి సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీ
Advertisement

నిన్నగాక మొన్న మళ్ళీ ఈటీవిలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు మల్లెమాల వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా ఓకె అన్నారు.. అని చెప్పిన కొద్ది రోజులకే సుడిగాలి సుధీర్ ఈ టీవీలోకి రీ ఎంట్రీ ఇచ్చేసాడు. ఆరు నెలలుగా ఈటీవికి, ఈ టివి షోస్ కి దూరంగా ఉంటూ అభిమానులని బాధపెట్టిన సుధీర్ ఫైనల్లీ ఈటీవిలోకి మళ్ళీ వచ్చేసాడు. కొద్దిగా ఫైనాన్స్ ప్రోబ్లెంస్ ఉన్నాయి.. మల్లెమాల వాళ్ళని అడ్జెస్ట్ చెయ్యమని అడిగాను, కానీ వాళ్ళు కుదరదు అన్నారు. తర్వాత ఆరు నెలలు బయటికి వెళతాను అని వాళ్ళని పర్మిషన్ అడిగి బయటికి వచ్చాను. స్టార్ మా లో సూపర్ సింగెర్స్ ప్రోగ్రాం కి యాంకర్ గా చేశాను. కాస్త కొత్తగా అనిపించింది. 

ఇక నేను ఈటివి నుండి బయటికి వచ్చిన ఆరు నెలలు పూర్తయ్యాయి.. మళ్ళీ జబర్దస్త్ కి శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళడానికి రెడీ అని చెప్పాడు. చెప్పినట్లుగానే సుడిగాలి సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ కి వచ్చేసాడు. అలా స్టయిల్ గా ఎంట్రీ ఇస్తూనే రావాలనికోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ, ఆశ్చర్యపోతారెందుకు అంటూ సుధీర్ పాత స్టయిల్ తోనే అద్దరగొట్టేసాడు.. యాంకర్ రష్మీ తో పాటుగా సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై నిలబడి.. వెల్ కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ అందరిలో ఉత్సాహాన్ని నింపాడు. సుధీర్ మళ్ళీ ఈటీవిలోకి వచ్చెయ్యడంపై ఆయన అభిమానులు చాలా సంతోషంలో ఉన్నారు.

Sudhir Sudheer re-entry into ETV was a shock:

Sudhir Sudheer re-entry into Sridevi Drama Company

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement