Advertisement

వైరల్: పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్

Sat 16th Apr 2022 05:51 PM
prabhas,prabhas marriage,radhe shyam promotions,prabhas national interview  వైరల్: పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్
Prabhas clarity over his marriage వైరల్: పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్
Advertisement

ప్రభాస్ పెళ్లి విషయం మీడియాకి ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఎందుకంటే ప్రభాస్ కి 40 ఏళ్ళు వచ్చేసాయి కానీ పెళ్లి చేసుకోలేదు. కనీసం చేసుకుంటాను అని మాటివ్వడం లేదు. అందుకే ప్రభాస్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు, లేదంటే ప్రభాస్ మీడియా ముందుకు వచ్చినప్పుడు ప్రభాస్ పెళ్లి విషయమై ప్రశ్న రాకుండా ఉండడం లేదు. రాధే శ్యామ్ ప్రమోషన్స్ లోను ప్రభాస్ ఈ ప్రశ్నని ఫేస్ చేసాడు. అప్పట్లో ప్రేమ విషయంలో తన అంచనాలు తప్పాయంటూ చెప్పిన ప్రభాస్ మరోసారి తన పెళ్లి విషయమై ఆసక్తికర కామెంట్స్ చేసారు.

ప్రభాస్ రీసెంట్ గా ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు యాంకర్.. మీ పెళ్లి ప్రశ్న ఎదురైనప్పుడు ఎప్పుడైనా చిరాకు, అసహనం అనిపించిందా అని అడగగా.. ప్రభాస్ లేదు.. ఎప్పుడు అలాంటిది ఫేస్ చెయ్యలేదు. పెళ్లి ప్రశ్న అనేది సాధారణమే. నాపెళ్లి గురించి వారు ఎంతగా ఆలోచిస్తున్నారో అని అనుకుంటాను. నేను కూడా వారి స్థానంలో ఉంటే ఇలానే ఆందోళన చెందేవాడిని ఏమో అని చెప్పిన ప్రభాస్ ని మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అని అడగగా.. నా పెళ్లి విషయమై నా వద్ద సమాధానం దొరికినప్పుడు తప్పకుండా అందరికి చెబుతాను అని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Prabhas clarity over his marriage:

 Prabhas surprising take on his marriage

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement