Advertisement

అడివి శేష్ తో ఫైట్ చెయ్యబోతున్న రవితేజ

Thu 11th Nov 2021 11:12 AM
khiladi movie,ravi teja khiladi movie,adivi sesh,major movie,adivi sesh major,ravi teja vs adivi sesh  అడివి శేష్ తో ఫైట్ చెయ్యబోతున్న రవితేజ
Ravi Teja vs Adivi Sesh అడివి శేష్ తో ఫైట్ చెయ్యబోతున్న రవితేజ
Advertisement

రవితేజ - రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న ఖిలాడీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని సాంగ్స్ చిత్రీకరణలో బిజీ గా ఉంది. ఎప్పుడో మే 28 నే విడుదల కావాల్సిన ఈ సినిమా సెకండ్ వేవ్ వలన పోస్ట్ పోన్ అయ్యింది. ఇక సెకండ్  వేవ్ ముగిసింది... ఖిలాడీ షూటింగ్ కంప్లీట్ అవుతున్నా.. రవితేజ ఖిలాడీకి మేకర్స్ నిన్నటివరకు డేట్ ప్రకటించలేదు. డిసెంబర్ లోనే ఖిలాడీ రిలీజ్ ఉంటుంది అనుకుంటుంటే.. ఏకంగా ఫిబ్రవరి 11, 2022 లో ఖిలాడీ మూవీని రిలీజ్ చెయ్యబోతున్నామంటూ మేకర్స్ షాకిచ్చారు. డిసెంబర్ లో చాలా సినిమాలు రిలీజ్ లు ఉన్నాయి. అలాగే జనవరి పాన్ ఇండియా మూవీస్ రచ్చ.

అందుకే ఈ రెండు నెలలు వదిలేసి ఖిలాడీని ఏకంగా ఫిబ్రవరికి తీసుకెళ్లిపోయారు. ఫిబ్రవరి 11 న అడివి శేష్ మేజర్ మూవీ కూడా పలు భాషల్లో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతుంది. సో రవితేజ అడివి శేష్ తో బాక్సాఫీసు ఫైట్ చెయ్యబోతున్నాడన్నమాట. ఇక ఖిలాడీ మూవీ సాంగ్స్ చిత్రీకరణ ముగించేసి.. రవితేజ రామ రావు ఆన్ డ్యూటీ, అలాగే ఢమాకా చిత్రాలతో పాటుగా.. ఈమధ్యనే ఎనౌన్స్ చేసిన పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరావు మూవీ చిత్రీకరణలో పాల్గొంటాడని తెలుస్తుంది. 

Ravi Teja vs Adivi Sesh:

Khiladi announces its grand arrival

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement