Advertisement

ప్రాణంపోయేవరకు పాలిటిక్స్ వదలను: కమల్

Sat 29th May 2021 05:48 PM
kamal haasan,responds,quitting,politics  ప్రాణంపోయేవరకు పాలిటిక్స్ వదలను: కమల్
Kamal Haasan responds on quitting politics ప్రాణంపోయేవరకు పాలిటిక్స్ వదలను: కమల్
Advertisement

లోకనాయకుడు కమల్ హాసన్ తనకున్న క్రేజ్, ఇమేజ్ అన్ని రాజకీయాలకు పనికొస్తాయని అనుకుని పాలిటిక్స్ లోకి దిగారు. కానీ కమల్ ని రాజకీయాలు మాములుగా దెబ్బకొట్టలేదు. కమల్ చాన్నాళ్లుగా రాజకీయాల్లో యాక్టీవ్ గా పాల్గొంటున్నారు. కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పొలిటికల్ పార్టీ పెట్టిన కమల్ హాసన్ తన పార్టీ ద్వారా తమిళనాడు అస్సాంబ్లీ ఎలక్షన్స్ లో అభ్యర్ధులని నిలబెట్టారు. మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టి తమిళనాడు అస్సాంబ్లీ ఎలక్షన్స్ లో జోరుగా ప్రచారం చేసినా.. కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ ఆ ఎన్నికల్లో ఓడిపోవడమే కాదు.. తన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోలేకపోయారు. మక్కల్ నీది మయ్యం పార్టీ ఈ ఎలక్షన్స్ లో ఓడిపోవడంతో.. ఆ పార్టీ నుండి ఎలక్షన్స్ లో నిలబడిన అభ్యర్థులు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు.

అంతేకాదు.. పార్టీని వీడుతూ కమల్ హాసన్ పై ఆరోపణలు చేస్తున్నారు. కీలక నేతలు కూడా పార్టీ నుండి వెళ్లిపోతున్నారు. అయితే కమల్ పార్టీ లో కీలకనేతలుగా కొనసాగిన వారు పార్టీని వీడుతూ.. పార్టీలో కమల్ సర్వాధికారం ప్రదర్శిస్తున్నారని కమల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దానికి స్పందించిన కమల్.. పార్టీని వీడి వెళ్లే వారు చేసే ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు. అంతేకాకుండా ఒకసారి పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని తిరిగి మల్లి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని కమల్ చెబుతున్నారు. అలాగే తన పార్టీలో ఎవరున్నా, లేకపోయినా తన ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు.

Kamal Haasan responds on quitting politics:

kamal says I will continue in politics until my last breath and in the coming days people of Tamil Nadu

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement