Advertisement

తండ్రికే నోటీసులు ఇచ్చిన స్టార్ హీరో

Wed 27th Jan 2021 06:14 PM
vijay,kollywood hero,vijay father,chandrashekar,political party,legal notice  తండ్రికే నోటీసులు ఇచ్చిన స్టార్ హీరో
Kollywood Star hero legal notice to his Father తండ్రికే నోటీసులు ఇచ్చిన స్టార్ హీరో
Advertisement

కోలీవుడ్ లో స్టార్ హీరోల పొలిటికల్ ఎంట్రీ పై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. రజినీకాంత్ తనపై వస్తున్న వార్తలకు తెర దించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే టైం లో ఆరోగ్యం పాడవడంతో కామ్ గా ఇంట్లోనే కూర్చుంటే కమల్ హాసన్ మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా అంటున్నారు. మరోపక్క దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ విషయంపై ఎప్పటికప్పుడు హాట్ హాట్ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. విజయ్ తండ్రి పొలిటికల్ పార్టీ ప్రకటించి తన కొడుకు విజయ్ మద్దతు తన పార్టీకి ఉంది, త్వరలోనే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది అనగానే విజయ్ డైరెక్ట్ గా నాకు మా నాన్న పార్టీకి సంబంధం లేదు.. అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసాడు.

రీసెంట్ గా విజయ్ వాళ్ళ నాన్నకి లీగల్ నోటీసు లు పంపడం హాట్ టాపిక్ గా మరింది. తన లాయర్ ద్వారా హీరో విజయ్ తన తండ్రికి లీగల్ నోటీసు లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు స్థాపించిన పార్టీతో విజయ్ కి ఎలాంటి సంబంధం లేదని, ఆ పార్టీ కోసం విజయ్ ఫోటో కానీ, ఆయన పేరు కానీ ఎక్కడా వాడరాదని, అలాగే మీ పార్టీకి విజయ్ మద్దతు ప్రకటించలేదంటూ ఆ నోటీసు లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ వీటిని మీరి విజయ్ పేరు లేదా ఆయన ఫోటో కానీ వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆ నోటీసు సారాంశంగా చెబుతున్నారు. మరి విజయ్ తండ్రి తన కొడుకు తనతోనే ఉంటాడంటుంటే.. విజయ్ మాత్రం ససేమిరా అనడమే కాదు.. ఇలా లీగల్ నోటీసులతో తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేసారు. 

Kollywood Star hero legal notice to his Father :

Vijay legal notice to his Father Chandrashekar

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement