Advertisement

తెలుగు నవలని తెరమీదకి తీసుకొస్తున్న క్రిష్..

Wed 19th Aug 2020 08:52 AM
krish,telugu novel,kondapolam,vaishnav tej,uppena,rakul preet singh  తెలుగు నవలని తెరమీదకి తీసుకొస్తున్న క్రిష్..
Krish bought Telugu Novel తెలుగు నవలని తెరమీదకి తీసుకొస్తున్న క్రిష్..
Advertisement

గమ్యం సినిమాతో ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని అందించిన క్రిష్, వేదం సినిమాతో మనసుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి, మణికర్ణిక చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచిన దర్శకుడిగా మాత్రం తనదైన ముద్ర కనబరిచాడు. ఐతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పీరియాడిక్ మూవీని తెరకిక్కిస్తున్న సంగతి తెలిసిందే.

విరూపాక్ష అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటు దొంగగా కనిపించనున్నాడట. ఈ సినిమా ఇంకా పూర్తికాకముందే క్రిష్ మరో సినిమాని లైన్లో పెట్టాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఉప్పెన సినిమాతో పరిచయం అవుతున్న వైష్ణవ్ తేజ్ కి ఇది రెండవ చిత్రం. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే ఈ సినిమా కోసం క్రిష, తెలుగు నవలని తెరమీదకి తీసుకొస్తున్నాడట.

సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రచించిన కొండపొలం అనే నవలని సినిమాగా మలచబోతున్నాడని సమాచారం. కథ ప్రకారం పశువులను మేపడానికి నెలల పాటు అడవుల్లోకి వెళ్లే  వారి జీవితం చూపించబోతున్నారు. షూటింగ్ పూర్తిగా వికారాబాద్ అడవుల్లో జరగనుందట. మొత్తానికి మరో అద్భుతమైన కథతో క్రిష్ మన ముందుకు వస్తున్నాడన్నమాట.

Krish bought Telugu Novel:

Krish  bought Telugu Novel

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement