Advertisement

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కోట శ్రీనివాస‌రావు!

Sat 11th Jul 2020 01:30 PM
kota srinivasa rao,rory movie,first look,birthday special,cm ramanna chowdary  తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కోట శ్రీనివాస‌రావు!
Kota Srinivasa Rao Plays Telangana CM Role in Rory Movie తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కోట శ్రీనివాస‌రావు!
Advertisement

‘రొరి’ మూవీలో తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కోట శ్రీనివాస‌రావు

విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాస‌రావు వేయ‌ని పాత్ర‌లు లేవ‌నే చెప్పాలి. భార‌త‌దేశంలో సుమారు అన్ని భాష‌ల్లో న‌టించి మెప్పించిన గొప్ప లెజండ‌రీ యాక్ట‌ర్ ఆయ‌న‌. గ‌తంలో చాలా చిత్రాల్లో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌నిపించారు. మ‌రికొన్ని పాత్ర‌ల్లో అపోజిష‌న్ లీడ‌ర్‌గా క‌నిపించారు. కాని మొట్ట‌మొద‌టిసారిగా కొత్త రాష్ట్రం అయిన తెలంగాణ ముఖ్య‌మంత్రిగా న‌టించ‌డం విశేషం. శుక్రవారం కోట శ్రీనివాస‌రావు పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ లుక్‌ని ‘రొరి’ చిత్ర యూనిట్ విడుద‌ల చేశారు.

ఈ చిత్రంలో ఆయ‌న చాలా సెన్సిటివ్ ముఖ్య‌మంత్రిగా వైవిధ్య‌మైన పాత్రలో న‌టిస్తున్నారు. ఈ పాత్ర పేరు ఆర్‌. రామ‌న్న చౌద‌రిగా ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దాడు. ఈ చిత్రాన్ని సీటీఎస్‌ స్టూడియోస్‌, ఎస్‌టీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ సంయుక్తంగా చరణ్‌ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మొద‌టి లుక్‌ని ఇటీవ‌ల విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్‌కి సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం విశేషం. భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Kota Srinivasa Rao Plays Telangana CM Role in Rory Movie:

Kota Srinivasa Rao Birthday Special: Rory Movie Look Released

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement