Advertisement

విజయ్‌ని పక్కనెట్టి శర్వాని లైన్‌లో పెట్టాడు

Thu 25th Jun 2020 12:37 PM
mahesh babu,sharwanand,vijay deverakonda,production,super star  విజయ్‌ని పక్కనెట్టి శర్వాని లైన్‌లో పెట్టాడు
Mahesh Babu and Sharwanand Combination soon విజయ్‌ని పక్కనెట్టి శర్వాని లైన్‌లో పెట్టాడు
Advertisement

మహేష్ బాబు ఇప్పుడు పరశురామ్‌తో సర్కారు వారి పాట పాడడానికి రెడీగా అయితే లేడు కానీ.. త్వరలోనే ఆ సినిమాతో పట్టాలెక్కబోతున్నాడు. అయితే ఓ పక్క సినిమాల్లో నటించడం మరోపక్క సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టడం... సినిమా నిర్మాణాల విషయంలో మహేష్ వైఫ్ నమ్రత యాక్టీవ్ గా ఉండడంతో.. మహేష్ మీడియం రేంజ్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. మరోపక్క తాను నటిస్తున్న సినిమాల్లో భాగస్వామిగా లాభాల్లో వాటాలు అందుకుంటున్నాడు. అయితే మహేష్ బ్యానర్ నుండి ప్రస్తుతం అడవి శేష్ హీరోగా మేజర్ మూవీ తెరకెక్కుతుంది.

తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా మహేష్ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్ నుండి మరో సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే విజయ్ ప్రస్తుతం పూరితోను తర్వాత దిల్ రాజు బ్యానర్ లోను సినిమాలు చేస్తుండడం, విజయ్ రేంజ్ కి సరిపోయే దర్శకుడు కానీ, కథ కానీ దొరకకపోవడంతో.. ఇప్పుడు మహేష్ మరో యంగ్ హీరోతో సినిమా చెయ్యాలనుకుంటున్నాడట. అది కూడా జానూ తో హిట్ కొట్టిన శర్వాతో. ఇటీవల తాను విన్న ఓ కథకు హీరోగా శర్వానంద్ అయితే బాగా సూటవుతాడని మహేశ్ భావిస్తున్నాడట. దానితో నమ్రత రంగంలోకి దిగి శర్వాతో అప్పుడే సంప్రదింపులు కూడా మొదలెట్టినట్టుగా ఫిలింనగర్ టాక్. మరి మహేష్ కి కథ నచ్చడం అంటే శర్వా కూడా రిజెక్ట్ చెయ్యడేమో అంటున్నారు.

Mahesh Babu and Sharwanand Combination soon:

Mahesh Babu will Produce movie with Sharwanand

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement