Advertisement

ప్రభాస్ మరో 50 లక్షలు.. పేటిఎమ్ 500 కోట్లు

Mon 30th Mar 2020 05:47 PM
prabhas,ccc,paytm,fund raising event,covid 19,corona virus  ప్రభాస్ మరో 50 లక్షలు.. పేటిఎమ్ 500 కోట్లు
Prabhas For CCC.. Paytm for PM Cares ప్రభాస్ మరో 50 లక్షలు.. పేటిఎమ్ 500 కోట్లు
Advertisement

సినీ వర్కర్స్ సంక్షేమం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 50 లక్షల రూపాయల విరాళం

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పాటిస్తున్న లాక్ డౌన్ వలన షూటింగ్‌లు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’ (సి సి సి) కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రూ. 50 ల‌క్ష‌ల రూపాయల విరాళం ప్ర‌క‌టించారు. ప్రభాస్ ఇది వరకే కరోనా నిర్మూలన చర్యల కోసం పి ఎమ్ రిలీఫ్ ఫండ్ కి 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలకు 1 కోటి రూపాయలు ( 50 లక్షల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ సీ ఎమ్ సహాయ నిధికి, 50 లక్షల రూపాయలు తెలంగాణ సీ ఎమ్ సహాయ నిధికి) సహాయం అందించారు. ఈ రోజు ప్రకటించిన 50 లక్షల రూపాయలతో ప్రభాస్ కరోనా పై పోరాటానికి 4 కోట్ల 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

 

క‌రోనా నివార‌ణకు 500 కోట్లు ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన పేటిఎమ్

క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచవ్యాప్తంగానే కాదు మ‌నదేశంలో కూడా విజృభిస్తుంది. అయితే ఈ వ్యాధిని అరిక‌ట్ట‌డానికి ప్ర‌భుత్వం అనేక ర‌కాల కార్య‌చ‌ర‌ణ‌లు చేస్తున్నాయి. ఇక యావ‌త దేశంలో ఉన్న ప్ర‌ముఖ‌లందరూ త‌మ వంతుగా క‌రోనా నివార‌ణ‌కు అనేకనేక స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తూ వ‌స్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్ర‌ధాన మంత్రి స‌హాయ నిధికి భారీగా విరాళాలు అందాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ఈ మ‌నీ కంపెనీ పే టీ ఎమ్ వారు ప్ర‌ధాన మంత్రి స‌హాయ నిధికి సామాన్యులు సైతం విరాళం అందించేలా ఓ వినూత్న ఫండ్ రైజింగ్ ప్రొగ్రామ్ ప్రారంభించారు. ఈ ఫండ్ రైజింగ్ ద్వారా 500 కోట్ల రూపాయ‌లు ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌నిధికి స‌మీక‌రించేలా పే టి ఎమ్ కార్య‌చ‌ర‌ణ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా పే టి ఎమ్ యాప్ నుంచి కానీ వెబ్ సైట్ నుంచి కానీ ఏదైనా వ‌స్తువు కొన్నా లేదా డొనేష‌న్ చేసినా ఆ మొత్తానికి 10 రూపాయ‌లు క‌లిపి ప్ర‌ధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కు అందేలా పేటిఎమ్ వారు ఈ ప్రొగ్రామ్ ను డిజైన్ చేశారు. మనంద‌రి మంచి కోసం పే టిఎమ్ వారు త‌ల‌పెట్టిన ఈ ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మానికి ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. అతి త్వ‌ర‌లో 500 కోట్లు స‌మీక‌రించి ప్ర‌ధాన మంత్రి స‌హాయ‌నిధికి అంద‌చేస్తామ‌ని పే టి ఎమ్ అధికార‌క ప్ర‌తినిధి తెలిపారు.

Prabhas For CCC.. Paytm for PM Cares :

Prabhas announces 50 lakhs to CCC and Paytm announces Fund raising Event

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement