Advertisement

సాయిరామ్ శంకర్ చిత్రం షూటింగ్ మొదలైంది

Wed 03rd Jul 2019 01:47 AM
sai ram shankar,new movie,launch,details  సాయిరామ్ శంకర్ చిత్రం షూటింగ్ మొదలైంది
Sai Ram Shankar New Movie Launched సాయిరామ్ శంకర్ చిత్రం షూటింగ్ మొదలైంది
Advertisement

ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నిర్మిస్తున్న ప్రేమ కథా చిత్రాన్ని ఇటీవల తలుపులమ్మ దేవస్థానంలో షూటింగ్ ప్రారంభించారు. తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాప్ కొట్టగా, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా హీరో సాయిరాం శంకర్ పై నూతన దర్శకుడు చిరుమామిళ్ల కృష్ణ తొలి సన్నివేశం చిత్రీకరించారు. 

అనంతరం చిత్ర కథా నాయకుడు సాయిరాం శంకర్ మాట్లాడుతూ తాను ఇంతవరకు నటించిన చిత్రాల్లోకి ఇది విభిన్న కథా చిత్రం అవుతుందని, తన కెరీర్ లో ఇదొక మైలు రాయిగా నిలుస్తుందని, తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన క్రైమ్ సస్పెన్స్ లవ్ స్టోరీ చిత్రంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకొని, ఆగస్టు నెల నుండి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి అమృత హరిణి క్రియేషన్స్ సురేష్ రెడ్డి , రియల్ రీల్స్ రాజా రెడ్డి , శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు  

Sai Ram Shankar New Movie Launched:

Sai Ram Shankar New Movie Details

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement