ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Naga Shourya and Ira Creations Movie Update

నాగశౌర్య-ఐరా క్రియేషన్స్ మూవీ అప్డేట్!

Naga Shourya and Ira Creations Movie UpdateNaga Shourya and Ira Creations Movie Update

హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మొద‌టి షెడ్యూల్ ని పూర్తిచేసుకున్న నాగ‌శౌర్య - ఐరా క్రియేష‌న్స్ చిత్రం 

ఛ‌లో లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌స్తున్న చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది.. జూన్ లో రెండ‌వ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ఈ  చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మొద‌టి షెడ్యూల్ అవుట్ పుట్ చాలా బాగా రావ‌టం, ద‌ర్శ‌కుడు క‌మిట్‌మెంట్ యూనిట్ లో అంద‌రికి ఆనందాన్ని క‌లిగించింది. చిత్ర స‌మ‌ర్ప‌కుడు శంక‌ర్ ప్ర‌సాద్ చాలా ద‌గ్గ‌రుండి అన్ని తానై ప్రొడ‌క్ష‌న్ చూసుకుంటున్నారు. లైన్ ప్రొడ్యూస‌ర్ బుజ్జి యూనిట్ లో అంద‌రికి ఏ ఇబ్బంది లేకుండా ఎండ‌లు ముండుతున్నాకూడా ఎండ దెబ్బ త‌గ‌ల‌కుండా యూనిట్ మెత్తాన్ని ఫ్యామిలిలా చూసుకున్నారు. నిర్మాత  ఉషాముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ద‌ర్శ‌కుడి విజ‌న్ ని ఏ లొకేష‌న్ కావాలంటే ఆ లొకేష‌న్ ఇచ్చి రిచ్ గా వుండేలా నిర్మాణ భాద్య‌త‌లు చూసుకుంటున్నారు. ఈ చిత్రంలో నాగ‌శౌర్యకి  జంట‌గా మెహరీన్ నటిస్తుంది.  హైద‌రాబాద్ లోని ఓక కాలెనిలో, ప‌బ్ లో ఇలా చ‌క్క‌టి లొకేష‌న్స్ ఎంచుకుని మొద‌టి షెడ్యూల్ ని విజ‌య‌వంతంగా పూర్తిచేశారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ.. ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని చాలా నిజాయితిగా నిర్మించాము. అంతే నిజాయితిగా అఖండ విజ‌యం అందించారు. మా బ్యాన‌ర్ లో చిత్రాలు అన్ని ప్రేక్ష‌కుడుని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తాము... ఛ‌లో మంచి ప్రేమ‌క‌థ‌, న‌ర్త‌న‌శాల మంచి కామెడి చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. అదే విధంగా నాగ‌శౌర్య న‌టించే ప్రొడ‌క్ష‌న్ నెం 3 చిత్రం షూటింగ్ మొద‌టి షెడ్యూల్ పూర్త‌యింది. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చేశాము. నాగ‌శౌర్య రాసిన క‌థ‌కి ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌తేజ ప్రాణం పోస్తున్నాడు. కెమెరామెన్ మనోజ్ రెడ్డి ప్ర‌తి ఫ్రేమ్ ని చాలా అందంగా అర్థ‌వంతంగా షూట్ చేస్తున్నాడు. మెహ‌రిన్ హీరోయిన్ గా మ‌రొక్క‌సారి ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందుతుంది. త‌దుప‌రి షెడ్యూల్ ని జూన్ లో చేస్తాము. అని అన్నారు.

పోసానికృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, ప్రొయ‌ర‌మ‌ణ‌, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్క‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి  మ్యూజిక్: శ్రీ‌చ‌ర‌ణ్‌, కెమెరా: మ‌నోజ్‌రెడ్డి, ఎడిట‌ర్‌గా రీబిహెచ్‌, ఆర్ట్‌డైరెక్ట‌ర్: కిర‌ణ్‌కుమార్ మ‌న్నే, కొరియోగ్రాఫర్: ర‌ఘుమాస్ట‌ర్‌, స్టోరీ: నాగ‌శౌర్య‌, స్ర్కీన్‌ప్లే: ర‌మ‌ణతేజ‌, ఫ‌ణీంద్ర‌ బిక్కిన‌, డైరెక్ష‌న్: ర‌మ‌ణ్‌తేజ‌, ప్రొడ్యూస‌ర్: ఉషాముల్పూరి, పిఆర్ ఓ: ఏలూరుశ్రీ‌ను. 

Naga Shourya and Ira Creations Movie 1st schedule Completed

naga shourya
ira creations
movie
1st schedule
completed