Advertisement

‘రాజావారు రాణిగారు’ ఫస్ట్‌లుక్ వదిలారు

Sat 04th May 2019 05:36 PM
rajavaru ranigaru,movie,first look,released  ‘రాజావారు రాణిగారు’ ఫస్ట్‌లుక్ వదిలారు
Rajavaru Ranigaru First look Released ‘రాజావారు రాణిగారు’ ఫస్ట్‌లుక్ వదిలారు
Advertisement

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వినూత్న రీతిలో ట్రెండ్ అయిన పదం RVRG . అసలు ఈ RVRG అంటే ఏమిట్రా బాబూ అంటూ తెగ ఆలోచించేసిన యూత్ సస్పెన్స్ కి తెర దించుతూ ఈ మధ్యనే ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ RVRG అంటే ‘రాజావారు రాణిగారు’ అంటూ టైటిల్ పోస్టర్ ను అలాగే ఒక మోషన్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ టైటిల్, మోషన్ వీడియోలో ఉన్న నేపథ్య సంగీతం ఇప్పటికే జనాన్ని తెగ ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రబృందం ఇవాళ విడుదల చేసింది.

‘రాజావారు రాణిగారు’ అనే టైటిల్ తో యూనిఫామ్ లో ముచ్చటగా ఉన్న హీరో హీరోయిన్లతో ఈ ఫస్ట్ లుక్  సహజత్వానికి చాలా దగ్గరలో ఉంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇదేదో కొంచెం మన స్కూల్, కాలేజ్ డేస్ లను గుర్తు చేసేలా ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ చిత్రం ద్వారా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ లు హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.

యువ నిర్మాత మనోవికాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా, జయ్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు.

Rajavaru Ranigaru First look Released:

Superb Response to Rajavaru Ranigaru Movie First Look

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement