Advertisement

‘అవెంజర్స్ - ఎండ్ గేమ్’ భారీగా ఉండబోతోంది

Mon 22nd Apr 2019 03:28 PM
avengers endgame,release,telugu update,record theaters  ‘అవెంజర్స్ - ఎండ్ గేమ్’ భారీగా ఉండబోతోంది
Avengers Endgame Release in Record Theaters ‘అవెంజర్స్ - ఎండ్ గేమ్’ భారీగా ఉండబోతోంది
Advertisement

తొలిసారిగా 500కు పైగా థియేటర్లలో విడుదలౌతున్న హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్’ - ‘ఎండ్ గేమ్’

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్. ఈ నెల 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలౌతోంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500కు పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ రూపొందించిన ఓ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ రూపంలో ఇంత భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం ఇదే తొలిసారి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు...  ఈ సినిమాకున్న డిమాండ్‌ను. 

ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు రాబర్ట్‌ డౌనీ జూనియర్ నటిస్తున్న ఈ చిత్రంలో క్రిస్‌ ఇవాన్స్‌, మార్క్ రఫాలో, క్రిస్ హేమ్స్ వర్త్, స్కార్లెట్ జాన్సన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ‘అవెంజర్స్‌’ సిరీస్‌ నుంచి వస్తున్న చివరి సూపర్‌హీరో చిత్రమిదని హాలీవుడ్‌ వర్గాల సమాచారం. ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ చిత్రానికి రుస్సో బ్రదర్స్‌  దర్శకత్వం వహించారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ సినిమా విడుదల కాబోతోంది. ఏడాది విరామం తర్వాత అవెంజర్స్‌ సిరీస్‌ చివరిదైన ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం కావడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత చిత్రంలో థానోస్‌ శక్తితో కనిపించకుండాపోయిన అవెంజర్స్‌ మళ్లీ తిరిగి ఎలా వచ్చారు? థానోస్‌ను ఎలా అంతం చేశారన్నదే ఈ కథ. థానోస్‌ పాత్రకి భల్లాలదేవ రానా తెలుగు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ కోసం సంగీత సంచలనం ఏ.ఆర్.రెహమాన్ రూపొందించిన పాట కూడా విశేష ఆదరణ పొందింది.

Avengers Endgame Release in Record Theaters:

Avengers Endgame Movie Telugu Update

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement