Advertisement

థమన్‌ ఫీల్‌ మిస్‌ కాకూడదు: సమంత

Sat 23rd Mar 2019 11:10 AM
samantha,advise,music director,ss thaman,majili movie  థమన్‌ ఫీల్‌ మిస్‌ కాకూడదు: సమంత
Samantha Advise to Music Director SS Thaman థమన్‌ ఫీల్‌ మిస్‌ కాకూడదు: సమంత
Advertisement

కొందరు సంగీత దర్శకులను ట్యూన్స్‌ అందించడానికి పెట్టుకుని రీరికార్డింగ్‌ను మరో వ్యక్తితో చేయిస్తారు. ఇక ట్యూన్స్‌పరంగా, ఆర్‌ఆర్‌ పరంగా... రెండింటిలో సరిసమానమైన ప్రాధాన్యం ఉండే వారు ఈ మధ్య తగ్గిపోయారు. ఆ మధ్య వరకు మణిశర్మ ట్యూన్స్‌తో పాటు ఆర్‌ఆర్‌ అందించడంలో ఎక్స్‌పర్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక గతంలో రాజ్‌-కోటిలలో కోటి ట్యూన్స్‌ విషయం చూసుకుంటే రాజ్‌ ఆర్‌ఆర్‌ సంగతి చూసుకునేవాడు. ప్రస్తుతం మణిశర్మ తర్వాత ఈ రెండింటికి న్యాయం చేయగలిగిన సంగీత దర్శకునిగా థమన్‌ పేరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 

ఇక విషయానికి వస్తే ప్రస్తుతం సమంత, నాగచైతన్యలు ‘ఏ మాయచేశావే, మనం, ఆటోనగర్‌సూర్య’ వంటి చిత్రాల తర్వాత ‘మజిలీ’లో నటిస్తున్నారు. పైన చెప్పిన మూడు చిత్రాలు వారి వివాహం ముందు వచ్చినవి కాగా, తాజాగా ‘మజిలీ’ చిత్రం మాత్రం వారి వివాహం అనంతరం కలిసి నటిస్తున్న చిత్రంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. నానితో ‘నిన్నుకోరి’ వంటి హిట్‌ని అందించిన శివనిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరి ‘మజిలీ’ చిత్రం ద్వారా ఈయన ద్వితీయ విఘ్నాన్ని అధిగమిస్తాడో లేదో చూడాలి. 

ఇక విషయానికి వస్తే తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్‌ సాంగ్‌ విడుదలైంది. సంగీత దర్శకుడు గోపీసుందర్‌ అందించిన ట్యూన్‌ బాగా ఆకట్టుకుంటోంది. ‘నువ్వు నిజంలాగా నన్ను ముడేస్తుంటే ఈ నిమిషాన... నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా.. నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలా నన్ను చూస్తున్నా.. నేను అదే పనిగా నిను వెలేస్తూ ఉన్నా....’ అంటూ ఈ పాట సాగుతుంది. చైతు, సమంతల మధ్య ఈపాట వస్తుందని అర్ధమవుతోంది. బరువైన భావాలను హుషారైన బీట్‌తో గోపీసుందర్‌ ఆవిష్కరించిన తీరు బాగుంది. వనమాలి సాహిత్యం ఎంతో పొందికగా, అర్దవంతగా, బరువైన పదాలతో సాగింది. అరుణ్‌గోపన్‌, చిన్మయి శ్రీపాద, బేబీ అనూష ఆలాపన మనసులను తాకే విధంగా ఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంగీత దర్శకుడైన గోపీసుందర్‌ ఆర్‌ఆర్‌ని మాత్రం అందించలేనని తేల్చిచెప్పాడట. కారణాలు మాత్రం ఏమిటో తెలియరావడం లేదు. ఆర్‌ఆర్‌ కూడా చేస్తానని పారితోషికం కూడా తీసుకున్న గోపీసుందర్‌ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడో అర్దం కావడం లేదు. 

దాంతో రీరికార్డింగ్‌ని థమన్‌ చేత చేయించాలని యూనిట్‌ భావిస్తోంది. ఈ మేర చర్చలు కూడా సాగాయట. సమయం తక్కువగా ఉండటంతో సమంత కూడా థమన్‌కి మెసేజ్‌ పెట్టింది. పెళ్లి తర్వాత నేను, చైతులు కలిసి నటిస్తున్న చిత్రం ఇది. సమయం తక్కువగా ఉన్నప్పటికీ మంచి ఫీల్‌ ఉండే రీరికార్డింగ్‌తో సినిమాని నిలబెట్టే బాధ్యత మీదే. ఎక్కడా ఫీల్‌ మిస్‌ కాకుండా చూడండి.. అని సమంత, థమన్‌కి పెట్టిన మెసేజ్‌లో పేర్కొంది. థమన్‌ కూడా దీనికి అంగీకరించాడని సమాచారం. కాగా ఈ చిత్రం ఏప్రిల్‌ 5వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Samantha Advise to Music Director SS Thaman:

SS Thaman RR To Majili Movie

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement