ఈ ‘హీరో’కి రచ్చ మొదలైంది..!

Fri 15th Mar 2019 05:17 PM
vijay deverakonda,siva karthikeyan,movies,same title  ఈ ‘హీరో’కి రచ్చ మొదలైంది..!
One More Title Controversy starts.. ఈ ‘హీరో’కి రచ్చ మొదలైంది..!
Sponsored links

నిన్నటివరకు హీరో నాని, మెగా స్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టుకున్నాడని... మెగా ఫ్యాన్స్ కస్సుబుస్సులాడారు. అలాగే మరో నిర్మాత కూడా తన సినిమాకి కూడా గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టుకున్నాక విక్రమ్ కుమార్ - నాని ఎలా తమ సినిమాకి గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టుకుంటారనే రచ్చ టాలీవుడ్ సాక్షిగా మీడియాకెక్కింది. తాజాగా మరో చిరు టైటిల్ పై రచ్చ మొదలయ్యేలా కనబడుతుంది ప్రస్తుత వ్యవహారం. ప్రస్తుతం వరస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండతో మైత్రి మూవీ మేకర్స్ వారు హీరో అనే టైటిల్ తో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో... తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళంలో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

అయితే అదే రకమైన టైటిల్ తో తాజాగా మరో తమిళ హీరో తన సినిమాని పట్టాలెక్కించేసాడు. నిన్న బుధవారం తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా పూజ కార్యక్రమాలతో మొదలైన సినిమాకి కూడా దర్శకనిర్మాతలు హీరో అనే టైటిల్ నే పెట్టారు. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండకి, శివ కార్తికేయన్ కి మధ్య కూడా ఈ టైటిల్ రచ్చ మొదలయ్యేలా కనబడుతుంది. విజయ్ దేవరకొండ.. అలాగే తమిళ హీరో శివ కార్తీకేయన్ లలో ఎవరో ఒక్కళ్ళు తమ సినిమా టైటిల్ మార్చుకోవాలి. తమిళనాట ఒకే టైటిల్ తో ఇద్దరు హీరోలు పోటీపడడం కుదరదు. కాబట్టి ఈ ఇద్దరి హీరోల్లో ఎవరు వెనెక్కి తగ్గి తమ సినిమా టైటిల్ మార్చుకుంటారో చూడాలి.

అయినా ఆ హీరో టైటిల్ ఒక్క చిరంజీవికి తప్ప మరెవరికి కలిసి రాలేదు. గతంలో హీరో నితిన్ కూడా వరస ప్లాప్స్ లో ఉన్నప్పుడు చిరు టైటిల్ హీరోని తీసుకుని సినిమా చేసాడు. కానీ నితిన్ కి ఆ హీరో టైటిల్ అండ్ సినిమా భారీ డిజాస్టర్ ఇచ్చింది. మరి ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ లో ఉన్న విజయ్ దేవరకొండకి ఈ హీరో టైటిల్ ఎంతవరకు కలిసొస్తుందో చూద్దాం.

Sponsored links

One More Title Controversy starts..:

Vijay Deverakonda and Siva Karthikeyan Movies with Same Title

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019