‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: వర్మ ‘ప్లాన్ బి’కి రెడీ!

Thu 14th Mar 2019 09:44 PM
ram gopal varma,lakshmis ntr,plans,premiere show,celebrities,media  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: వర్మ ‘ప్లాన్ బి’కి రెడీ!
RGV Focus on Plan B for Lakshmis NTR ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: వర్మ ‘ప్లాన్ బి’కి రెడీ!
Sponsored links

లక్ష్మీస్ ఎన్టీఆర్ తో చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. మార్చి 22 న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అంటూ ట్రైలర్స్ తోనూ, సాంగ్స్ తోనూ హంగామా చేస్తున్న వర్మతో ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ లో ఇలాంటి సినిమా వస్తే టిడిపి మీద వ్యతిరేఖత వస్తుందని టిడిపి నేతలే కాదు.. ఆ సినిమా వలన తమ ఫ్యామిలీ పరువుపోతుందనే మీమాంశలో నందమూరి ఫ్యామిలీ కొట్టుమిట్టాడుతోంది. మరోపక్క చంద్రబాబు లక్ష్మీస్ ఎన్టీఆర్ తో విలన్ లా ప్రజల్లో మిగిలిపోతాడు. అందుకే సినిమాని ఆపాలంటూ టిడిపి నేత దేవీబాబు చౌదరి ఈసీకి కంప్లైంట్ కూడా చేసాడు. మరోపక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై మీడియాలో సస్పెన్సు కొనసాగుతుంది.

ఈలోపు వర్మ మరో ప్లాన్ తో అందరిని ఉడికించడానికి ‘ప్లాన్ బి’కి రెడీ అవుతున్నాడనే టాక్ వినబడుతుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఆగిపోయే అవకాసం ఉందంటూ మీడియాలో వార్తలొస్తున్న నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ స్పెషల్ ప్రీమియర్ షోని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రీమియర్ సినిమా విడుదలకు వారం ముందే వేయాలనే ప్లాన్ లో వర్మ ఉన్నాడట. అలాగే మీడియా వారికి, కొంతమంది సినీ ప్రముఖులకు.. స్పెషల్ ప్రీమియర్ షో వేసి చూపాలని వర్మ ఫిక్స్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక ప్రీమియర్ ద్వారా లక్ష్మీస్ ఎన్టీఆర్ టాక్ స్ప్రెడ్ చెయ్యొచ్చనే ఆలోచనతో వర్మ ఈ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తుంది. మరి వర్మ ప్లాన్ వర్కౌట్ అయితే గనక సినిమా టాక్ తోనే సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. 

అంతేకాకుండా ప్రీమియర్ వేసాక.. టాక్ బయటికొచ్చేస్తుంది కాబట్టి.. ఇక సినిమా ఆపే ధైర్యం ఎవరూ చెయ్యరనే వర్మ ఈ మాస్టర్ ప్లాన్ వేసుంటాడంటున్నారు. ఏది ఏమైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్స్ లోకి వచ్చేవరకు సస్పెన్స్ గానే కనబడుతుంది.

Sponsored links

RGV Focus on Plan B for Lakshmis NTR:

Varma plans Lakshmis NTR Premiere for Celebrities and Media

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019