మొత్తానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని ఇరికించారు

Thu 14th Mar 2019 01:00 PM
ram gopal varma,lakshmis ntr,doubt,release  మొత్తానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని ఇరికించారు
Complaint to EC on Lakshmis NTR మొత్తానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని ఇరికించారు
Sponsored links

రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సేషన్ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కి కష్టాలు తప్పేలా లేవు. ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా రిలీజ్ ను ఆపాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఫిర్యాదు చేసారు. ఈమూవీలో తన అధినేతను చంద్రబాబును నెగిటివ్ రోల్‌లో చూపించారని... దీని ప్రభావం రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై పడుతుందని ప్రస్తావించాడు.

ఎలక్షన్స్ అయ్యేవరకు సినిమా ఆపాలని ఆయన అన్నారు. ఈసినిమాను నిర్మించిన రాకేష్‌ రెడ్డి వైసీపీకి చెందిన వ్యక్తి అని.. ఇందులో రాజకీయ దురుద్దేశాలు కూడా ఉన్నాయని ఆరోపించాడు దేవీబాబు. అందుకే ఈసీకి ఫిర్యాదు చేశామని... ఒకవేళ ఈసీ చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపాడు.

మార్చి 22 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఈసీ ఆపినా ఆపవచ్చని అంటున్నారు. ఒకవేళ ఈ సినిమా ఆపితే ఫైట్ చేస్తాను అని అన్నాడు వర్మ. అసలు చంద్రబాబును నేను నెగటివ్ గా చూపించలేదని.. జరిగిన వాస్తవం ఏంటో చూపించానని వర్మ ఆరోపించాడు. మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో  చూడాలి.

Sponsored links

Complaint to EC on Lakshmis NTR:

Doubts on Lakshmis NTR Release

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019