Advertisement

‘కెఎస్100’ అప్పుడే సెన్సార్ కొచ్చేసింది

Wed 13th Mar 2019 09:13 PM
ks 100,movie,censor,latest,update  ‘కెఎస్100’ అప్పుడే సెన్సార్ కొచ్చేసింది
KS 100 in Censor Stage ‘కెఎస్100’ అప్పుడే సెన్సార్ కొచ్చేసింది
Advertisement

సెన్సార్ కార్యక్రమాలలో మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ ల ‘కెఎస్100’  చిత్రం..!!

మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం ‘కెఎస్100’.. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి షేర్ దర్శకత్వం వహిస్తున్నారు.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్  గా రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే  ఫస్ట్ లుక్ విడుదల కాగా, మంచి స్పందన దక్కించుకుని సినిమాపై అంచనాలను ఏర్పరుచుకుంది.. 

కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలలో ఉంది.. ఈ నెలలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతుండగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘కెఎస్100’ చిత్రం అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.. ఈనెలలోనే సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా ఇంతబాగా రావడానికి సహకరించిన అందరికి ధన్యవాదాల’’ అన్నారు.  

అక్షిత, అషి, పూర్వి సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం సమకూరుస్తుండగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు.. 

నటీనటులు:  అక్షిత, అషి,పూర్వి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు

సాంకేతిక నిపుణులు : 

మాటలు- కథనం-దర్శకత్వం: షేర్

నిర్మాత : వెంకట్ రెడ్డి

కెమెరా: వంశీ

మ్యూజిక్: నవనీత్ చారి

ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున

సాహిత్యం: భాష్య శ్రీ, 

కొరియోగ్రఫీ: జొజొ

యాక్షన్: మాలేష్

నేపథ్యసంగీతం :రామ్ మోహన్ చారి

అసొషియెట్ డైరెక్టర్: రవితేజ

ఆర్ట్: సుదర్శన్

KS 100 in Censor Stage:

KS 100 Movie Latest Update

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement