చిన్న హీరో నటించిన 2 సినిమాలు.. ఒకేరోజు!

Wed 13th Mar 2019 09:03 PM
young hero,ram karthik,2 movies,released,same day  చిన్న హీరో నటించిన 2 సినిమాలు.. ఒకేరోజు!
Young Hero Creates Record with 2 Movies చిన్న హీరో నటించిన 2 సినిమాలు.. ఒకేరోజు!
Sponsored links

మార్చి 15 న యంగ్ హీరో రామ్ కార్తిక్ నటించిన ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’, ‘మౌనమే ఇష్టం’ చిత్రాలు విడుదల..!!

సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజు  ఒకే హీరోకి సంభందించిన రెండు సినిమాలు విడుదల అవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.. ప్రస్తుతం పరిస్థితులలో ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే విడుదల చేస్తున్న తరుణంలో యంగ్ హీరో రామ్ కార్తిక్ ఒకే రోజున రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. ఆయన నటించిన ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’, ‘మౌనమే ఇష్టం’ చిత్రాలు మార్చి 15 న విడుదల అవుతున్నాయి. 

రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రామ్ కార్తిక్ హీరోగా  కిషోర్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ చిత్రం వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మిపై ఇప్పటికే మంచి అంచనాలుండగా, మౌనమే ఇష్టం లాంటి యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.. దాదాపు 150 సినిమాలకు పైగా ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసి, 5 నంది అవార్డ్స్‌ గెలుచుకున్న అశోక్‌ కుమార్‌ తొలిసారి ‘మౌనమే ఇష్టం’ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం విశేషం.

ఇక టీజర్, ట్రైలర్ తో విశేష స్పందన దక్కించుకున్న వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి లో రామ్ కార్తీక్ సరసన పూజిత పొన్నాడ నటించగా, మౌనమే ఇష్టం సినిమాలో రామ్ కార్తీక్ సరసన పార్వతి అరుణ్, రీతూచౌదరి  హీరోయిన్లుగా నటించారు.

Sponsored links

Young Hero Creates Record with 2 Movies:

Young Hero Ram Karthik acted 2 Movies Released Same Day

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019