Advertisement

‘షేడ్స్ ఆఫ్ సాహో 2’కు డేట్ ఫిక్సయింది

Mon 25th Feb 2019 02:16 PM
saaho,shades of saaho,prabhas,uv creations,prabhas saaho,sujith  ‘షేడ్స్ ఆఫ్ సాహో 2’కు డేట్ ఫిక్సయింది
Date Fixed for Shades of Saaho 2 ‘షేడ్స్ ఆఫ్ సాహో 2’కు డేట్ ఫిక్సయింది
Advertisement

‘బాహుబలి’ 1,2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15‌న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌లకి సిద్ధ‌మౌతోంది. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 కి ఇప్ప‌టికే ఇండియా మెత్తం క్రేజ్ వ‌చ్చింది. ప్ర‌పంచంలో వున్న రెబెల్‌స్టార్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. ఇక మార్చి 3న షేడ్స్ ఆఫ్ సాహో 2తో మరో సర్ ప్రైజ్ విడుదల చేయనున్నారు. 

డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ ని క్యాప్చర్ చేయడం మరో విశేషం. ఇంత‌టి భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి ర‌న్‌ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్  దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. 

ప్రభాస్ స‌ర‌స‌న‌ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌రిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను... స్టార్ రైటర్ అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ‌తో కనిపించబోతున్నారు.  

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మా బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సాహో ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది. మార్చి 3న ఈ సినిమాకు సంబంధించిన ‘షేడ్స్ ఆఫ్ సాహో 2’ విడుదల చేయబోతున్నాం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్, గ్రాఫిక్స్ ఉండబోతున్నాయి. ప్రభాస్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, సుజిత్ వరల్డ్ క్లాస్ విజన్, శ్రద్ధా కపూర్ అందచందాలు, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ టాప్ క్లాస్ మ్యూజిక్, మధి గ్రాండియర్ విజువల్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అని అన్నారు

బ్యానర్: యువి క్రియేషన్స్

దర్శకుడు: సుజీత్

నిర్మాతలు: వంశీ-ప్రమోద్

సంగీతం: శంకర్-ఎహసాన్-లాయ్

సినిమాటోగ్రాఫర్: మధి

ఆర్ట్ డైరెక్టర్: సాబు సిరీల్

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

పిఆర్వో: ఏలూరు శ్రీను

Date Fixed for Shades of Saaho 2:

Shades of Saaho 2 Release on March 3rd

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement