Advertisement

మొత్తానికి మ‌హేష్‌ని 35 ల‌క్ష‌ల‌కు బుక్ చేశారు!

Fri 22nd Feb 2019 03:35 PM
mahesh babu,amb cinemas,mahesh amb cinemas,sunil narang amb cinemas,gst  మొత్తానికి మ‌హేష్‌ని 35 ల‌క్ష‌ల‌కు బుక్ చేశారు!
mahesh babu amb cinemas pays gst మొత్తానికి మ‌హేష్‌ని 35 ల‌క్ష‌ల‌కు బుక్ చేశారు!
Advertisement

వెండితెర‌పై హీరో ఒక్క‌సారిగా విల‌న్‌గా మారారు. చెయ్య‌ని త‌ప్పిదానికి భారీ మూల్యం చెల్లించారు. న‌మ్ర‌త కార‌ణంగా మ‌ల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట‌ర‌య్యారు మ‌హేష్‌బాబు. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి స‌మీపంలో పంపిణీదారుడు సునీల్ నారంగ్‌తో క‌లిసి మ‌హేష్‌బాబు ఏఎంబీ సినిమాస్ పేరుతో మ‌ల్టీప్లెక్స్‌ని నిర్మించిన విష‌యం తెలిసిందే. భారీ హంగుల‌తో అత్యంత రీదైన ప్రాంతంలో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ ప్ర‌తి విష‌యంలోనూ వార్త‌ల్లో నిలుస్తోంది. అయితే ఈ ధియేట‌ర్ నిర్మాణంలో జీఎస్టీని యాజ‌మాన్యం ఎగ్గెట్టింద‌ని, దీనికి తోడు త‌గ్గించిన జీఎస్టీ రేట్ల ప్ర‌కారం టికెట్‌లు విక్ర‌యించ‌కుండా పాత ప‌ద్ద‌తిలోనే టికెట్‌లు విక్ర‌యిస్తున్నార‌ని కేంద్ర జీఎస్టీ అధికారులు ఇటీవ‌ల ఏఎంబీ సినిమాస్‌పై దాడులు నిర్వ‌మించారు. 

ఈ దాడుల్లో జీఎస్టీ రేట్ల ప్ర‌కారం టికెట్‌లు విక్ర‌యించ‌కుండా పాత రేట్ల‌కే టికకెట్లు విక్ర‌యిస్తున్న‌ట్లు బ‌య‌ట‌ప‌డ‌టంతో కేసులు న‌మోదు చేశారు. దీంతో మ‌హేష్‌బాబు 35.66 ల‌క్ష‌లు జీఎస్టీ నెనాల్టీ క‌ట్టాల్సి వ‌చ్చింది. మ‌హేష్ క‌ట్టిన ఈ మొత్తాన్ని వినియోగ‌దారుల సంక్షే నిధికి కేంద్ర‌ప్ర‌భుత్వం త‌ర‌లించ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అయితే టికెట్ రేట్‌ల అంశం రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోకి వ‌స్తుంది కాబ‌ట్టి 28 శాతం నుంచి 18 శాతానికి త‌గ్గించాల్సిన అవ‌స‌రం లేద‌ని భావించామ‌ని, అందుకే త‌గ్గించ‌లేద‌ని ఏఎంబీ సినిమాస్ ప్ర‌తినిధుల బృందం హైద‌రాబాద్ జీఎస్టీ ప్రిన్సిప‌ల్ క‌మీష‌న‌ర్‌కు ఓ లేఖ‌లో పేర్కొన‌డం ప‌లువురికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. సిబ్బంది చేసిన త‌ప్పు వ‌ల్ల మీడియా, జానాల దృష్టిలో హీరో మ‌హేష్ విల‌న్‌గా నిల‌బ‌డాల్సి వ‌చ్చింద‌ని ప‌లువురు మండిప‌డుతున్నారు. 

mahesh babu amb cinemas pays gst:

mahesh babu pays gst 35 lakhs

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement