Loading...

‘ఎఫ్ 3’లో.. మూడో హీరో రవితేజ కాదు!

Young Hero in Anil Ravipudi F3 Movie

వరుణ్‌తేజ్ - వెంకీ కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ‘ఎఫ్ 2’ చిత్రం బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని 100 కోట్ల క్లబ్‌లో చేరింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. ‘ఎఫ్ 2’ ప్రమోషన్స్ టైమ్‌లో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకి సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని చెప్పాడు.

అయితే ‘ఎఫ్ 3’లో మాస్ మహారాజ్ రవితేజ ఉంటాడు అని ఫిలింనగర్‌లో మొన్నటి వరకు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ రవితేజ ప్లేస్‌లో వేరే యంగ్ హీరోని పెట్టాలని డిసైడ్ అయ్యాడు దిల్ రాజు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు నితిన్ అంట.

అవును నితిన్‌ను ‘ఎఫ్ 2’ సీక్వెల్‌లో పెట్టి.. రవితేజతో “రాజా ది గ్రేట్” సీక్వెల్‌ని తెరకెక్కించాలని దిల్ రాజు ప్లాన్ అంట. అయితే ఈ విషయంపై దిల్ రాజు క్యాంపు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అనిల్ అయితే ఎఫ్ 2 సీక్వెల్ కథ కాకుండా మహేష్‌తో చేసే సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.

Nithiin Replaces Raviteja in Dil Raju F3 Movie

f3 movie
dil raju
nithiin
raviteja
anil ravipudi
anil ravipudi f2 movie