Advertisement

విశ్వాసం తెలుగు రిలీజ్ ఎప్పుడంటే..?

Thu 21st Feb 2019 09:00 PM
ajith,viswasam,release date,march 1st,nayanthara,viswasam telugu release  విశ్వాసం తెలుగు రిలీజ్ ఎప్పుడంటే..?
Viswasam Telugu Release Date Fixed విశ్వాసం తెలుగు రిలీజ్ ఎప్పుడంటే..?
Advertisement

మార్చి 1న అజిత్‌, శివ ‘విశ్వాసం’

‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత హీరో అజిత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ డ్రామా ‘విశ్వాసం’. ఇటీవ‌ల త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. అజిత్ స‌ర‌స‌న లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని స‌త్య‌జ్యోతి ఫిలింస్ అసోసియేష‌న్‌తో ఎన్‌.ఎన్‌.ఆర్ ఫిలింస్ ప‌తాకంపై ఆర్‌.నాగేశ్వ‌ర‌రావు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఇందులో టాలీవుడ్‌కి చెందిన విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. అనువాద కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి 1న విడుద‌ల చేయ‌నున్నారు. 

ఈ సంద‌ర్భంగా ఎన్‌.ఎన్‌.ఆర్ ఫిలింస్ అధినేత ఆర్.నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ.. ‘‘హీరో అజిత్ సినిమాల‌కు త‌మిళ‌నాడులోని క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయన సినిమా విడుద‌లంటే అక్క‌డ పండుగ వాతావర‌ణ‌మే. అజిత్, శివ కాంబినేష‌న్‌లో మూడు వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు వచ్చాయి. వీరి క‌ల‌యిక‌లో వచ్చిన నాలుగో బ్లాక్ బస్ట‌ర్ విశ్వాసం. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం త‌మిళ‌నాడులో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. ఎందరో నిర్మాత‌లు ఈ సినిమా తెలుగు హ‌క్కుల కోసం పోటీ ప‌డ్డారు. ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో తెలుగు హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాను. అవ‌కాశం ఇచ్చిన స‌త్య‌జ్యోతి ఫిలింస్ వారికి నా ధన్య‌వాదాలు. స‌త్యజ్యోతి ఫిలింస్ వారి అసోసియేష‌న్‌తో తెలుగులో ఈ చిత్రాన్ని మార్చి 1 విడుద‌ల చేయ‌బోతున్నాం. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా సెన్సేష‌న‌ల్ స‌క్సెస్ అవుతుంది’’ అన్నారు. 

అజిత్‌, న‌య‌న‌తార‌, జ‌గ‌ప‌తిబాబు, అనైక‌, వివేక్, రోబో శంక‌ర్‌, యోగిబాబు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఎడిట‌ర్‌: రూబెన్‌, సంగీతం: డి.ఇమాన్‌, సినిమాటోగ్ర‌ఫీ: వెట్రి, నిర్మాత‌: ఆర్.నాగేశ్వ‌ర‌రావు, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శివ.

Viswasam Telugu Release Date Fixed:

Ajith Viswasam Movie Release on March 1st

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement