ఆర్ ఆర్ ఆర్ `వెయ్యి మంది` తెర‌వెనుక క‌థ‌?

Sat 16th Feb 2019 11:51 AM
rrr,rajamaouly,rama charan,ntr,rrr movie,ram charan ntr movie,rajamouly rrr,rrr first look date  ఆర్ ఆర్ ఆర్ `వెయ్యి మంది` తెర‌వెనుక క‌థ‌?
RRR 1000 fighters fight behaind the story ఆర్ ఆర్ ఆర్ `వెయ్యి మంది` తెర‌వెనుక క‌థ‌?
Sponsored links

రాజ‌మౌళి- రామ్‌చ‌ర‌ణ్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `మ‌గ‌ధీర‌` ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే.  ఎపిసోఈ సినిమాలోని షేర్‌ఖాన్‌గా శ్రీ‌హ‌రి క‌నిపించే స‌న్నివేశాల‌తో పాటు వంద‌మంది శ‌త్రు సైనికుల‌తో రామ్‌చ‌ర‌ణ్ చేసే వీరోచిత పోరాట ఘ‌ట్టం ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచింది. మ‌గ‌ధీర‌` చిత్రానికి ఆయువుప‌ట్టుగా నిలిచిన ఈ స‌న్నివేశం ఇప్ప‌టికీ మాస్ జ‌నాల్లో మెదులుతూనే వుంది. అదే త‌ర‌హా స‌న్నివేశాన్ని ఇప్పుడు `ఆర్ ఆర్ ఆర్‌` కోసం రాజ‌మౌళి ప్లాన్ చేశాడ‌ని తెలిసింది. అయితే ఈ సారి వంద మంది కాదు. వెయ్యి మంది తో రామ్‌చ‌ర‌ణ్ వీరోచితంగా పోరాటం చేయ‌నున్నాడ‌ని, ఈ స‌న్నివేశం క్లైమాక్స్ కాక‌పోయినా క్లైమాక్స్‌ని త‌ల‌పించేలా వుంటుంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

ఈ పోరాట ఘ‌ట్టాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఇటీవ‌లే చిత్రీక‌రించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే ఈ స‌న్నివేశంలో వెనుక సినిమా నేప‌థ్యానికి సంబంధించిన కీల‌క అంశం బ‌య‌టికి వ‌చ్చింది. బిఫోర్ ఇండిపెండెంట్ కాలం నేప‌థ్యంలో సినిమా సాగుతుంద‌ని, ఆ స‌మ‌యంలో వెయ్యి మంది ఉద్య‌మ‌కారులు ఓ పోలీస్ స్టేష‌న్‌పై మెరుపుదాడికి పూనుకుంటార‌ని, బ్రిటీష్ ప్ర‌భుత్వంలో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్న రామ్‌చ‌ర‌ణ్ ఆ దాడిని వీరోచితంగా ఎదుర్కొంటాడ‌ని, ఆ త‌రువాత తానే ఉద్య‌మ‌కారుడిగా మారి బ్రిటీష్ సామ్రాజ్యంపై యుద్దం ప్ర‌క‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది తెలియాలంటే జ‌క్క‌న్న లీకులు ఇచ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.  

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బందిపోటుగా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజైన మార్చి 27న రివీల్ చేయ‌బోతున్న‌ట్లు వినిపిస్తోంది. `బాహుబ‌లి`కి సంబంధించిన పాత్ర‌ల పరిచ‌యాన్ని వారి వారి పుట్టిన రోజుల సంద‌ర్భంగా విడుద‌ల చేసిన‌ట్లుగానే ముందు రామ్‌చ‌ర‌ణ్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన లుక్‌ల‌ను విడుద‌ల చేయ‌బోతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల క‌థ‌నం. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది తెలియాలంటే మార్చి 27 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Sponsored links

RRR 1000 fighters fight behaind the story:

RRR first look date fix

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019