Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Again Rumours on Sye Raa Narasimha Reddy

‘సైరా’పై మళ్లీ వార్తలు.. చరణ్ స్పందిస్తేనే!

Again Rumours on Sye Raa Narasimha Reddy

బాహుబలి రెండు పార్టులు రిలీజ్ అవ్వడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. అయితే చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సైరా రిలీజ్ అవ్వడానికి ఇంచుమించు అంతే పడుతుంది. బాహుబలి కి రాజమౌళి కాబట్టి ఎక్కడా రాజీ పడడు కాబట్టి అంత టైం పట్టినా సినిమా హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సురేందర్‌రెడ్డి మీద అంత హోప్స్ లేవు. అయితే సురేందర్‌రెడ్డితో నిర్మాత రామ్ చరణ్ కూడా సినిమా అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడ రాజీ పడడంలేదని టాక్. అందుకే షూటింగ్ పదేపదే వాయిదా పడుతూ వస్తుంది.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ సైరా సినిమా 2019 దసరా కానుకగా రిలీజ్ అవుతుందని చెప్పాడు. అయితే తాజా సమాచారం ప్రకారం షూటింగ్ ఆలస్యం అవుతుందని.. డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ఎక్కడ రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించడంలో సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాక్. 

2017 సంక్రాంతి సీజన్‌లో వచ్చినా ఖైదీ నెం.150 చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే బాహుబలి సినిమాకు ఐదు సంవత్సరాలు పడితే సైరాకు మూడేళ్లు పట్టేలా ఉంది. ఈసినిమా 2020 లో వస్తుందని వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరి ఈ వార్తలకి తెర దించాలంటే నిర్మాత రామ్ చరణ్ నోరు విప్పాల్సిందే.

Sye Raa Narasimha Reddy Movie Release postponed

sye raa
sye raa narasimha reddy
chiranjeevi
ram charan
release
postponed