Advertisement

సిరివెన్నెల‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం!

Sat 26th Jan 2019 04:45 PM
sirivennela seetha ramasastry,sirivennela,padma awards,padmasri  సిరివెన్నెల‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం!
sirivennela gets padmasri సిరివెన్నెల‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం!
Advertisement

తెలుగు సినిమా పాట‌కు వ‌న్నె తెచ్చిన సినీ గేయ ర‌చ‌యిత‌ల్లో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిది ప్ర‌త్యేక శైలి. తెలుగు పాట‌కు ఆయ‌నో సిరివెన్నెల. `సిరి వెన్నెల‌` సినిమాతో మొద‌లైన ఆయ‌న ప్ర‌స్థానం అర‌వింద స‌మేత లోని పెనివిటి లాంటి పాట‌ల‌వ‌ర‌కు అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతూనే వుంది. సిరివెన్నెల‌నే త‌న ఇంటిపేరుగా మార్చుకున్న ఆయ‌న తెలుగు సినిమాకు గ‌త కొన్నేళ్లుగా చేస్తున్నసేవ‌ల‌ను గుర్తించిన కేంద్ర ప్ర‌భుత్వం ఈ రోజు ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల్లో ఆయ‌న‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది. గ‌తంలో చాలా వేదిక‌ల‌పై పుర‌స్కారాల‌పై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేశారాయ‌న‌. ఆయ‌న‌కున్న విద్వ‌త్తుకు ప‌ద్మ పుర‌స్కారం ఎప్పుడో రావాల్పింది. ఇప్ప‌టికైనా ఇచ్చారు సంతోషం అని సినీ పెద్ద‌లు అంటున్నారు.  

ఈ రోజు ప్ర‌క‌టించిన పుర‌స్కారాల్లో వివిధ రంగాల‌కు చెందిన 14 మందికి ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారాలు ప్ర‌క‌టించిన కేంద్రం 94 మందికి ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాలు ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి ప్ర‌ముఖ సినీ గేయ‌ర‌చియిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి వుండ‌గా త‌మిళం చిత్ర సీమ నుంచి ప్ర‌మ‌/ క‌ఒరియోగ్రాఫ‌ర్‌, న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవా, ప్ర‌ముఖ డ్ర‌మ్స్ ప్లేయ‌ర్ శివ‌మ‌ణి వుండ‌టం విశేషం. మ‌ల‌యాళ చిత్ర సీమ నుంచి ప్ర‌ముఖ న‌టుడు మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ కూడా వున్నారు. వీరితో పాటు ప్ర‌ముఖ ఇస్రో శాస్త్ర వేత్త నంబి నారాయ‌ణ్‌ను కూడా ప‌ద్మ పుర‌స్కారం ద‌క్కింది. ఆయ‌న జీవిత క‌థ ఆధారంగా మాధ‌వ‌న్ `రాకెట్రీ` ది నంబీ ఎఫెక్ట్` పేరుతో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. 

sirivennela gets padmasri :

sirivennela gets padmasri award

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement