‘కాంచ‌న‌-3’ ఫస్ట్ లుక్ వదిలారు

Thu 10th Jan 2019 01:15 PM
raghava lawrence,kanchana 3,ovia,vedhika,muni,kanchana 3 first look  ‘కాంచ‌న‌-3’ ఫస్ట్ లుక్ వదిలారు
Kanchana 3 First Look Released ‘కాంచ‌న‌-3’ ఫస్ట్ లుక్ వదిలారు
Sponsored links

ఏప్రిల్ 18 న ప్ర‌పంచ‌వాప్తంగా విడుద‌ల‌కానున్న రాఘ‌వ లారెన్స్  ‘కాంచ‌న‌-3’ 

మోష‌న్ పోస్ట‌ర్ మెట్ట‌మెద‌టిసారి డాల్బి ఎట్మాస్ సౌండ్‌తో విడుద‌ల 

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2‌తో హ‌ర్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే హ్య‌జ్ సక్సెస్ ని సాధించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, ద‌ర్శ‌కుడిగా ముని ప్రాంచాయిస్ నుండి వ‌స్తున్న హ‌ర్ర‌ర్ కామెడి చిత్రం కాంచ‌న‌-3, రాఘ‌వ లారెన్స్ అందించిన హ‌ర్ర‌ర్ చిత్రాల‌న్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలుగా బాక్సాఫీస్ ని షేక్ చేసిన‌వే.. ఈ కాంచ‌న‌-3 చిత్రం మాత్రం లారెన్స్ కి స్పెష‌ల్ చిత్రంగా తెర‌కెక్కుతుంది. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావొస్తుంది. రాఘ‌వ లారెన్స్ ఏమి చేసినా స్పెష‌ల్ గా ఉంటుంది. ఇప్పుడు కాంచ‌న‌-3 కోసం ఆయ‌న ఒక మోషన్ పోస్ట‌ర్ ని తెలుగు వెర్ష‌న్ కోసం రిలీజ్ చేశారు. అయితే ఒక శ్లోఖంతో స్టార్ట‌య్యి స్ల‌మ్ ఏరియాని చూపిస్తూ క్లాత్ నుండి యాక్ష‌న్ సీన్ అక్క‌డి నుండి రుద్రాక్ష‌లు ధ‌రించి, తెల్ల‌టి పంచెక‌ట్టుకుని, వైట్ హెయిర్ స్టైయిల్ తో ద‌ర్జాగా కూర్చొని వున్న హీరో పోస్ట‌ర్ ని తెలుగులో మొట్టమొదటి సారిగా డాల్బి అట్మాస్ సౌండ్ తో విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో లైట్ హౌస్ మూవీమేక‌ర్స్ LLP బ్యాన‌ర్ పై బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణంలో తెర‌కెక్కించారు. ఏప్రిల్ 18న విడుద‌ల కానున్న ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ మోషన్ పోస్ట‌ర్ ని పాత్రికేయ మిత్రుల కోసం ప్రత్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. 

ఈ సంద‌ర్బంగా బి.మ‌ధు గారు మాట్లాడుతూ.. రాఘ‌వ లారెన్స్ స్వయంగా అందించిన హ‌ర్ర‌ర్ సినిమాలు అన్నీ సూపర్ హిట్లే. అందులో ముని సీక్వెల్స్  మరీ స్పెషల్. కాంచన పేరుతో స్టార్ట‌యిన త‌రువాత ఇప్పుడు కాంచ‌న‌-3 గా ప్రేక్ష‌కుల ముందుకు ఏప్రిల్ 18న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నాము. రాఘ‌వ లారెన్స్ కి ఈ చిత్రం చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఈ సీరిస్ లో ఇది నాలుగో చిత్రం. ఆయ‌న ప్ర‌తి చిత్రంలో త‌న గెట‌ప్ ని సామాన్య ప్రేక్ష‌కుడికి ద‌గ్గ‌ర‌గా వుండేలా చూసుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో వైట్ హెయిర్ తో న్యూస్టైల్ కి నాంది ప‌లికారు. మేము విడుద‌ల చేసిన కాంచ‌న -3 మోషన్ పోస్ట‌ర్ విత్ సౌండ్ కి ఇప్ప‌టికే స్పంద‌న చాలా బాగుంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుక‌గా మా బ్యాన‌ర్ లైట్‌హౌస్ మూవీ మేకర్స్ LLP బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణంలో తెర‌కెక్కించాము. ఆడియ‌న్స్ కూడా ఈ చిత్రం కోసం చాలా ఆశ‌క్తిగా ఎదురు చూడ‌టం విశేషం. గ‌త మూడు చిత్రాల‌ని మించి కాంచ‌న‌-3 వుండ‌బోతుంద‌ని న‌మ్ముతున్నాము.. అని అన్నారు.

న‌టీన‌టులు.. రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, స‌త్య‌రాజ్‌, కిషోర్ త‌దిత‌రులు

సినిమాటోగ్ర‌ఫి- వెట్రి, సర్వేష్ మురారి,

పి.ఆర్‌.ఓ- ఏలూరు శ్రీను

లైట్ హౌస్ మూవీమేక‌ర్స్ ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్ 

బి.మ‌ధు స‌మ‌ర్పించు

రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్

రాఘ‌వ నిర్మాణం

క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌కత్వం

రాఘ‌వ లారెన్స్‌

Sponsored links

Kanchana 3 First Look Released :

Raghava Lawrence Kanchana 3 First Look and Release Date out

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017