Advertisement

‘మిరాకిల్’ పోస్టర్ వదిలారు

Mon 31st Dec 2018 11:19 AM
miracle movie poster,miracle movie poster launch,miracle,hari gills,suman rana  ‘మిరాకిల్’ పోస్టర్ వదిలారు
Miracle Movie Poster Launched ‘మిరాకిల్’ పోస్టర్ వదిలారు
Advertisement

సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘మిరాకిల్’ పోస్టర్ విడుదల 

హరి గిల్స్ హీరోగా సుమన్ రాణా హీరోయిన్ గా వామన చలన చిత్ర స్టూడియోస్, చిగాస్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ బ్యానర్స్ పై రుద్రపట్ల వేణుగోపాల్ (ఆర్‌విజి) దర్శకత్వంలో హరి, విష్ణు నిర్మిస్తోన్న చిత్రం మిరాకిల్. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం మూడో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఈ చిత్రం పోస్టర్ లాంచ్ కార్యక్రమం మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో హరి గిల్స్, హీరోయిన్ సుమన్ రాణా, దర్శకుడు రుద్రపట్ల వేణుగోపాల్ {ఆర్ వి జి}, ప్రముఖ నటులు విజయ్ కుమార్, జీవా, సందీప్ భరద్వాజ్, సంగీత దర్శకుడు జయకుమార్, కెమెరామెన్ వేణు మురళీధర్, కో-ప్రొడ్యూసర్ సి.వి.ఆర్.గణేష్ తదితరులు పాల్గొన్నారు. 

దర్శకుడు రుద్రపట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడిగా ఇది నా ఐదవ సినిమా. వాస్తవ సంఘటనలకు నిజ జీవిత పాత్రలకు కల్పన జోడిస్తూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మిరాకిల్ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో, ఎవరూ ఊహించని మలుపులతో ఈ చిత్ర కథ సాగుతుంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సౌత్ ఇండియా బిగ్ ఆర్టిస్టులందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు. గోవా, హైదరాబాద్, బెంగుళూరు‌లో రెండు షెడ్యూల్స్ జరిపాము. మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దీంతో రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తవుతుంది. మారిషస్‌లో పాతాళ చిత్రీకరణ మార్చిలో జరిపి మే 24న ప్రపంచ వ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేస్తాం..’’ అన్నారు. 

హీరో హరి గిల్స్ మాట్లాడుతూ.. ‘‘వేణుగోపాల్ చెప్పిన స్టోరీ చాలా బాగా నచ్చింది. హీరోగా నా తొలి చిత్రం. నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కచ్చితంగా మిరాకిల్ అవుతుంది..’’ అన్నారు. 

హీరోయిన్ సుమన్ రాణా మాట్లాడుతూ.. ‘‘ఇదొక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. డైరెక్టర్ వేణు చెప్పిన కథ చాలా అద్భుతంగా నచ్చింది. మోడల్ గా వున్న నేను మిరాకిల్ చిత్రం‌తో హీరోయిన్ గా పరిచయం కావడం చాలా హ్యాపీగా వుంది..’’ అన్నారు.

Miracle Movie Poster Launched:

Miracle Movie Poster Release Event Highlights

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement