ఆ హీరోకి బ్రేకప్ చెప్పాకే బాగుపడ్డాను

Fri 07th Dec 2018 08:15 PM
katrina kaif,ranvir kapoor  ఆ హీరోకి బ్రేకప్ చెప్పాకే బాగుపడ్డాను
Katrina Kaif Happy After Breakup With Ranvir Kapoor ఆ హీరోకి బ్రేకప్ చెప్పాకే బాగుపడ్డాను
Sponsored links

హీరోయిన్లన్నాక హీరోలతో ఎఫైర్లు చాలా కామన్. నచ్చితే పెళ్లి వరకూ వెళ్ళే సదరు రిలేషన్ షిప్, సెట్ అవ్వలేదని ఇద్దరిలో ఏ ఒక్కరికీ అనిపించినా వెంటనే బ్రేక్ అయిపోతుంది. ప్రేమించే విషయంలో హీరోయిన్ల ఇన్వాల్వ్ మెంట్ ఎంత ఉంటుందో తెలియదు కానీ, బ్రేకప్ విషయంలో మాత్రం 90 శాతం హీరోదే తప్పు అండ్  బాధ్యత ఉంటుంది. ఈ కోవకు చెందిన బ్రేకప్పులు ఎక్కువగా బాలీవుడ్ లో కనిపిస్తుంటాయి. ఈ బ్రేకప్, ప్యాచ్ అప్ గురించి హీరోహీరోయిన్స్ పబ్లిక్లో స్టేట్ మెంట్ ఇవ్వడానికి మాత్రం ఇష్టపడరు. 

బట్ హాటెస్ట్ హీరోయిన్ ఆఫ్ బాలీవుడ్ అయిన కత్రినా కైఫ్ మాత్రం రణబీర్ కపూరుతో తన బ్రేకప్ గురించి బాహాటంగా మాట్లాడడమే కాకుండా, రణబీరుతో బ్రేకప్ అయ్యాక తాను సంతోషంగా ఉన్నానని, కెరీర్ మీద కాన్సన్ ట్రేట్ చేయగలుగుతున్నాని, రిలేషన్లో ఉన్నప్పుడు నాకు నేను సమయం కేటాయించుకోవడానికి కుదిరేది కాదు. నిజం చెప్పాలంటే అతడితో బ్రేకప్ అయ్యాకే నా కెరీర్ గాడిలో పడింది అని చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్. 

ఈ బ్రేకప్ అనంతరం మళ్ళీ తన పాత ప్రియుడు సల్మాన్ చెంతకి కత్రినా వెళ్లిపోగా... దీపిక, కత్రినాలతో బ్రేకప్ అనంతరం రణబీర్ మాత్రం ఆలియా భట్ అమ్మడుతో డేటింగ్ మొదలెట్టాడు. ఇదే కదా బాలీవుడ్లో బ్రేక్ అప్  తమాషా.

Sponsored links

Katrina Kaif Happy After Breakup With Ranvir Kapoor:

Katrina Kaif Happy After Breakup With Ranvir Kapoor. She Is Looking For Career and Breakup is a Blessing.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019