‘ఎన్టీఆర్’: ఇప్పుడు కన్ఫ్యూజ్ ఏంటి క్రిష్?

Fri 07th Dec 2018 03:31 PM
balakrishna,krish,director,ntr biopic,problems  ‘ఎన్టీఆర్’: ఇప్పుడు కన్ఫ్యూజ్ ఏంటి క్రిష్?
Director Krish Confused with NTR Biopic Scenes ‘ఎన్టీఆర్’: ఇప్పుడు కన్ఫ్యూజ్ ఏంటి క్రిష్?
Sponsored links

నందమూరి తారక రామారావు అంటే ఒక పుస్తకం. కాదు కాదు.... ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా ఆయన గురించిన విషయాలు పుడుతూనే  ఉంటాయి. ఎన్టీఆర్ మరణించేవరకు ఆయనతో తిరిగిన సన్నిహితులు తప్ప ఆయన గురించిన విషయాలు కూలంకషంగా ఎవరికీ తెలియవు. ఆఖరుకి ఆయన కొడుకులకి కూడా. అయితే ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ... సినిమా విషయాలు తెలిసిన సన్నిహితులకు, రాజకీయ విషయాలు తెలియవు. రాజకీయ విషయాలు తెలిసిన వారికి.. ఎన్టీఆర్ నట జీవితం పూర్తిగా తెలియదు. ఇప్పుడు ఇదే విషయంలో ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నాడట. ఎన్టీఆర్ గురించి పూర్తిగా తెలుసు అనుకోవడం ఎంత పొరపాటో ఇప్పుడు బాలయ్యకి, క్రిష్‌కి అనుభవంలోకి వస్తుందట.

ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్‌ని రెండు భాగాలుగా తీస్తూ.. అన్ని విషయాలను ఐదున్నర గంటల్లో రెండు పార్ట్ లుగా విభజించి చూపించొచ్చు అనే క్రిష్, బాలయ్యల నిర్ణయం అభినందనీయం. అలాగే బిజినెస్ పరంగానూ లాభసాటి వ్యవహారమే. అయితే కావాల్సినంత నిడివి దొరకడంతో క్రిష్, ఎన్టీఆర్ గురించి తెలుసు అని అనుకున్న సీన్స్ అన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా క్రిష్‌ని పైన చెప్పిన సమస్య తొలిచేస్తోందట. అదేమంటే క్రిష్ పక్కాగా స్క్రిప్ట్‌లో ఎన్టీఆర్ గురించి తెలుసుకున్న సీన్స్ అన్ని తీసుకుంటూపోతున్నాడట . ఆ సీన్స్‌తో పాటుగా.. రోజుకో కొత్త ఆలోచ‌న‌, కొత్త సీనూ పుట్టుకు రావడం, ఎన్టీఆర్ గురించి రోజుకో కొత్త విషయం తెలియడంతో ఆ సీన్స్‌ని కూడా క్రిష్ తీసుకుపోతున్నాడట.

మరి అతను తీసిన సన్నివేశాల్లో ఎన్ని సినిమాలు ఉంటాయో కూడా తెలియనంతగా క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ సీన్స్‌ని చిత్రీకరిస్తున్నాడట. మరి ఎన్టీఆర్ గురించి రోజుకో విషయం తెలియడంతో.. అందులోని ఆసక్తితో కొన్ని, బాలయ్య చెప్పినవి కొన్ని ఇలా తెలియకుండానే సీన్లు పెరుగుతూ పోతున్నాయని సమాచారం. అసలే యమా ఫాస్ట్‌గా ఉన్న క్రిష్ అనుకున్నవి అనుకున్నట్టుగా, తోచినవి తోచినట్టుగా స్పీడ్ స్పీడ్‌గా ఎన్టీఆర్ బయోపిక్ షూట్‌ని పూర్తి చేస్తున్నాడట. మరి అన్ని సీన్స్ తీసేస్తున్న క్రిష్ ఆయా సీన్స్‌ని సినిమాలో ఎక్కడ కలపాలి, అవి ఎక్కడ పెడితే అతుకుతాయో అనేది ఇప్పుడు క్రిష్‌కు తలకు మించిన భారమవుతుందట. చూద్దాం ఫైనల్‌గా కథానాయకుడు, మహానాయకుడు‌లో ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయనేది.

Sponsored links

Director Krish Confused with NTR Biopic Scenes:

New problem to Director Krish about NTR Biopic

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019