‘ఎఫ్ 2’ టైమ్ స్టార్ట్స్..!!

Fri 07th Dec 2018 03:02 PM
f2,varun tej,venkatesh,tamanna,mehreen,f2 teaser release date,f2 teaser release details  ‘ఎఫ్ 2’ టైమ్ స్టార్ట్స్..!!
Venki and Varun F2 Time Starts ‘ఎఫ్ 2’ టైమ్ స్టార్ట్స్..!!
Sponsored links

డిసెంబ‌ర్ 12న ‘ఎఫ్ 2’ టీజ‌ర్‌

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్’ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ ఫ‌న్ రైడర్‌ను యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. ‘ప‌టాస్’, ‘సుప్రీమ్‌’, ‘రాజా ది గ్రేట్‌’ వంటి హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్ర‌మిది. మంచి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించడంలో మంచి ప‌ట్టు ఉన్న అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను డిసెంబ‌ర్ 12న విడుద‌ల చేస్తున్నారు. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘కుటుంబ క‌థా చిత్రాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫ‌న్ రైడర్ ‘ఎఫ్‌2’. మెసేజ్‌తో పాటు అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా యాడ్ చేసి లాఫింగ్ రైడ‌ర్‌లాంటి చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మూడు వ‌రుస హిట్స్ త‌ర్వాత చేస్తోన్న చిత్ర‌మిది. వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ ఇలా సూప‌ర్బ్‌ కాంబినేష‌న్‌తో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఒక సాంగ్ మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ప్రస్తుతం ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌కు ప్లాన్ చేస్తున్నాం. డిసెంబ‌ర్ 12న టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. అలాగే పాట‌ల‌ను కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తాం. సంక్రాంతి కానుక‌గా సినిమాను వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం..’’ అన్నారు.

Sponsored links

Venki and Varun F2 Time Starts :

F2 Teaser Release on December 12

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019