మార్ఫింగ్ లుక్‌తో నీరుగార్చేశారే!

Thu 06th Dec 2018 11:44 PM
the iron lady,nitya menon,priyadarshini,jayalalitha,jaya biopic,vishnu induri,paper tale pictures  మార్ఫింగ్ లుక్‌తో నీరుగార్చేశారే!
nithya menon morphing look మార్ఫింగ్ లుక్‌తో నీరుగార్చేశారే!
Sponsored links

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఫెరోషియ‌స్ లైఫ్‌స్టోరీ నేప‌థ్యంలో ఓ సినిమా త‌మిళ, తెలుగు భాష‌ల్లో త్వ‌ర‌లో తెర‌పైకి రాబోతున్న విష‌యం తెలిసిందే. `ది ఐర‌న్ లేడీ` పేరుతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. పేప‌ర్ టేల్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్రియ‌ద‌ర్శిని ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో రూపొందించ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఐర‌న్ లేడీ జ‌య‌ల‌లిత పాత్ర‌లో నిత్యామీన‌న్ న‌టిస్తోంది. ఈ సినిమాతో పాటు ముర‌ళీమోహ‌న్ అల్లుడు విష్ణు ఇందూరి కూడా జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తెర‌పైకి తీసుకురావ‌డానికి పెద్ద స్కెచ్చేవేశాడు కానీ దానికి సంబ‌ధించిన అప్‌డేట్ ఇంత వ‌ర‌కు బ‌య‌టికి రాలేదు.

ఇదిలా వుంటే తాజాగా త‌మిళ ద‌ర్శ‌కురాలు ` ద ఐర‌న్ లేడీ` పేరుతో చేస్తున్న సినిమాకు సంబంధంచిన ఫ‌స్ట్‌లుక్ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో అచ్చం జ‌య‌ల‌లిత‌ను పోలిన నిత్యామీన‌న్ ఫొటో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇదే ఫ‌స్ట్ లుక్ అని, ఫొలోలో నిత్యామీన‌న్ అచ్చం `అమ్మ‌`లాగే వుంద‌ని ఓ ప‌క్క పొగ‌డ్త‌ల వ‌ర్షం కూడా మొద‌లైంది. అయితే ఆ ఫొలోని నిశితంగా ప‌రిశీలిస్తే షాకింగ్ ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఫొటో అస‌లు ఫ‌స్ట్ లుకే కాద‌ని, జ‌య‌ల‌లిత పాత ఫొటోను తీసుకుని నిత్య త‌ల‌ను జోడించి మార్ఫింగ్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తుండ‌టంతో జ‌య‌ల‌లిత బ‌యోపిక్ టీమ్‌పై సెటైర్లు ప‌డుతున్నాయి. మార్ఫింగ్‌ల‌తో బ‌యోపిక్‌ని నీరుగార్చేశార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ మార్ఫింగ్ పిక్ పై త‌మిళ చిత్ర బృందం ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తుందో చూడాలి.

Sponsored links

nithya menon morphing look:

nithya morphing look 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019